Soosi soosi naagu gadusodyamuga dayavuttee

చూచి చూచి నాకు గడుసోద్యముగ దయవుట్టీ
Language

(॥పల్లవి॥)
చూచి చూచి నాకు గడుసోద్యముగ దయవుట్టీ
యేచి నీసేవే సేసే మా ఇంటికి రావయ్యా

(॥చూచి॥)
వెలలేని వేడుకతో వేగినంతా నవ్వితివి
అలవోక సరసాల నాపెతోను
పలుకుఁదేనె తీపులు పై పైఁ జవి చూపితివి
అలపుదేర్చేఁగాని మాయాడకు రావయ్యా

(॥చూచి॥)
మనసు దనియలేక మాపుదాఁకఁ బెనగితి -
వనేకరీతులా గోరి యాపెతోడను
వినోదించితివి చాలా విచ్చనవిడి నక్కడ
నిను సేదదీర్చీను మానెలవుకు రావయ్యా

(॥చూచి॥)
ఇక్కువలంటి యాసల నిందాఁకా భోగించితి -
వక్కజమైన రతుల నాపెతోడను
నెక్కొని శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గూడితివి
నిక్కము నిన్ను మెప్పించే నిచ్చలు రావయ్యా

(||pallavi||)
sūsi sūsi nāgu gaḍusodyamuga dayavuṭṭī
yesi nīseve sese mā iṁṭigi rāvayyā

(||sūsi||)
vĕlaleni veḍugado veginaṁtā navvidivi
alavoga sarasāla nābĕdonu
palugum̐denĕ tībulu pai paim̐ javi sūbidivi
alabudersem̐gāni māyāḍagu rāvayyā

(||sūsi||)
manasu daniyalega mābudām̐kam̐ bĕnagidi -
vanegarīdulā gori yābĕdoḍanu
vinodiṁchidivi sālā vichchanaviḍi nakkaḍa
ninu sedadīrsīnu mānĕlavugu rāvayyā

(||sūsi||)
ikkuvalaṁṭi yāsala niṁdām̐kā bhogiṁchidi -
vakkajamaina radula nābĕdoḍanu
nĕkkŏni śhrīveṁkaḍeśha nem̐ḍu nannum̐ gūḍidivi
nikkamu ninnu mĕppiṁche nichchalu rāvayyā