చూచి చూచి నాకైతే సోద్యమయ్యీని
(॥పల్లవి॥)
చూచి చూచి నాకైతే సోద్యమయ్యీని
యీ చేఁతలెల్లా మీకు నిద్దరికే చెల్లును
(॥చూచి॥)
సారె సారె నాపె నీపై సణఁగులు చల్లఁగాను
వోరుచుక యెట్టున్నావో వోయమ్మ నీవు
బీరాన నప్పటి నీతో పెనుఁబంతా లాడఁగాను
యీరీతి నేమీ ననవు యెంత మొగమోటమో
(॥చూచిఁ॥)
వెడ వెడగా నిన్ను వెక్కసాన సాదించఁగా
వొడఁబాటు లెట్టాయనో వోయమ్మ నీకు
జడియక నీమీఁద జంకెనలు చూపఁగాను
యెడనెల నవ్వు నవ్వే వేఁటి చుట్టరికమో
(॥చూచి॥)
పెక్కుమారు లింతసేసి ప్రియములు చెప్పఁగాను
వొక్కటైతి వే గుణమో వోయమ్మ నీది
ఇక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యిక్కడి కాపెఁ దెచ్చేవు యెంత జాణతనమో
(||pallavi||)
sūsi sūsi nāgaide sodyamayyīni
yī sem̐talĕllā mīgu niddarige sĕllunu
(||sūsi||)
sārĕ sārĕ nābĕ nībai saṇam̐gulu sallam̐gānu
vorusuga yĕṭṭunnāvo voyamma nīvu
bīrāna nappaḍi nīdo pĕnum̐baṁtā lāḍam̐gānu
yīrīdi nemī nanavu yĕṁta mŏgamoḍamo
(||sūsim̐||)
vĕḍa vĕḍagā ninnu vĕkkasāna sādiṁcham̐gā
vŏḍam̐bāḍu lĕṭṭāyano voyamma nīgu
jaḍiyaga nīmīm̐da jaṁkĕnalu sūbam̐gānu
yĕḍanĕla navvu navve vem̐ṭi suṭṭarigamo
(||sūsi||)
pĕkkumāru liṁtasesi priyamulu sĕppam̐gānu
vŏkkaḍaidi ve guṇamo voyamma nīdi
ikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yikkaḍi kābĕm̐ dĕchchevu yĕṁta jāṇadanamo