చూచి చూచి మేము తన్ను సూడులువట్టేముగాక
(॥పల్లవి॥)
చూచి చూచి మేము తన్ను సూడులువట్టేముగాక
యేచి అందరిలోఁ దన యెన్నిక గాదా
(॥చూచి॥)
సతమాయఁ బతిపొందు సలిగెలన్నియుఁ జెల్లె
వెతదీరెఁ దనకు గర్వించవలదా
జతనాన మెల్లనే సంగడిఁ గూచుండఁ జొచ్చె
అతివేడుకలు తన కవునేకాదా
(॥చూచి॥)
చెక్కులఁ గళలు నిండె సిగ్గులు నవ్వులఁ దేరే
వెక్కసమై తాను విఱ్ఱవీఁగవలదా
వక్కణతో సవతులవరుసవంతుకుఁ జొచ్చె
మిక్కుటమై తనచేయి మీఁదేకాదా
(॥చూచి॥)
చేవదేరెఁ గెమ్మావి విరసుక్రుమ్ముడి జారె
దేవులాయఁ దన కిదె దిష్టముగాదా
శ్రీవేంకటేశ్వరుఁడు చేరికూడె నిందరిని
కైవసమాయఁ బనులు ఘనురాలెకాదా
(||pallavi||)
sūsi sūsi memu tannu sūḍuluvaṭṭemugāga
yesi aṁdarilom̐ dana yĕnniga gādā
(||sūsi||)
sadamāyam̐ badibŏṁdu saligĕlanniyum̐ jĕllĕ
vĕdadīrĕm̐ danagu garviṁchavaladā
jadanāna mĕllane saṁgaḍim̐ gūsuṁḍam̐ jŏchchĕ
adiveḍugalu tana kavunegādā
(||sūsi||)
sĕkkulam̐ gaḽalu niṁḍĕ siggulu navvulam̐ dere
vĕkkasamai tānu viṭravīm̐gavaladā
vakkaṇado savadulavarusavaṁtugum̐ jŏchchĕ
mikkuḍamai tanaseyi mīm̐degādā
(||sūsi||)
sevaderĕm̐ gĕmmāvi virasukrummuḍi jārĕ
devulāyam̐ dana kidĕ diṣhṭamugādā
śhrīveṁkaḍeśhvarum̐ḍu serigūḍĕ niṁdarini
kaivasamāyam̐ banulu ghanurālĕgādā