చూచి చూచి మాకు నేఁడు సోద్యమయ్యీని
(॥పల్లవి॥)
చూచి చూచి మాకు నేఁడు సోద్యమయ్యీని
యేచి నీ మొగము చూచి యేమీ ననఁజాలనే
(॥చూచి॥)
చొప్పలెత్తి మాటలాడి సోగకన్నులనుఁ జూచి
వుప్పతించి పతి నెంత వొరసేవే
తప్పఁడు బొంకఁ డతఁడు తగవెరిఁగినవాఁడు
ఇప్పుడు నిన్నుఁ బెండ్లాడి ఇంత రట్టుకెక్కెనే
(॥చూచి॥)
పుక్కట సన్నలుసేసి బొమ్మలను జంకించి
చక్కనియీతని నెంత సాదించేవే
మొక్కళీఁడు గాఁడు పోఁడు మొగమోట గలవాఁడు
వెక్కసాన నితనితో వెల్లవిరియాయనే
(॥చూచి॥)
తరితీపులఁ జెనకి తమకము గడురేఁచి
ఇరవై శ్రీవేంకటేశు నెంత గూడేవే
తరలఁడు మరలఁడు తగ నన్ను నేలినాఁడు
సరసము నీతో నాడి సదమదమాయనే
(||pallavi||)
sūsi sūsi māgu nem̐ḍu sodyamayyīni
yesi nī mŏgamu sūsi yemī nanam̐jālane
(||sūsi||)
sŏppalĕtti māḍalāḍi sogagannulanum̐ jūsi
vuppadiṁchi padi nĕṁta vŏraseve
tappam̐ḍu bŏṁkam̐ ḍadam̐ḍu tagavĕrim̐ginavām̐ḍu
ippuḍu ninnum̐ bĕṁḍlāḍi iṁta raṭṭugĕkkĕne
(||sūsi||)
pukkaḍa sannalusesi bŏmmalanu jaṁkiṁchi
sakkaniyīdani nĕṁta sādiṁcheve
mŏkkaḽīm̐ḍu gām̐ḍu pom̐ḍu mŏgamoḍa galavām̐ḍu
vĕkkasāna nidanido vĕllaviriyāyane
(||sūsi||)
taridībulam̐ jĕnagi tamagamu gaḍurem̐si
iravai śhrīveṁkaḍeśhu nĕṁta gūḍeve
taralam̐ḍu maralam̐ḍu taga nannu nelinām̐ḍu
sarasamu nīdo nāḍi sadamadamāyane