చూచి చూచి మాకిందుకు సోద్యమయ్యీని
(॥పల్లవి॥)
చూచి చూచి మాకిందుకు సోద్యమయ్యీని
చేచేత నిన్నింత నేను సేయఁజాలఁగా
(॥చూచి॥)
నెలఁత గూచుండఁగాను నిలుచుండి మాటాడేవు
యెలమి నీ దొరతన మేమి చెప్పేది
కలువల వేయఁగాను కడు నొడ్డించుకొనేవు
వలపు నిన్నింత సేసి వంచుకొనెఁగా
(॥చూచి॥)
అడపములోనివీడె మాపెకు నీవందిచ్చేవు
కడలేని నీ పంతము కానవచ్చెను
అడరి చేయి చాఁచితేను అంది కైలాగిచ్చేవు
వెడయాస నీసిగ్గు విడిపించెఁగా
(॥చూచి॥)
చెమరించె నంటాను చెక్కుచేతఁ దుడిచేవు
తమితోఁ బెద్దరిక మింతకు వచ్చెను
అమర శ్రీవెంకటేశ ఆలమేల్‌మంగఁ గూడితి
జమళి నన్నేలితి వాసతి చెప్పెఁగా
(||pallavi||)
sūsi sūsi māgiṁdugu sodyamayyīni
seseda ninniṁta nenu seyam̐jālam̐gā
(||sūsi||)
nĕlam̐ta gūsuṁḍam̐gānu nilusuṁḍi māḍāḍevu
yĕlami nī dŏradana memi sĕppedi
kaluvala veyam̐gānu kaḍu nŏḍḍiṁchugŏnevu
valabu ninniṁta sesi vaṁchugŏnĕm̐gā
(||sūsi||)
aḍabamulonivīḍĕ mābĕgu nīvaṁdichchevu
kaḍaleni nī paṁtamu kānavachchĕnu
aḍari seyi sām̐sidenu aṁdi kailāgichchevu
vĕḍayāsa nīsiggu viḍibiṁchĕm̐gā
(||sūsi||)
sĕmariṁchĕ naṁṭānu sĕkkusedam̐ duḍisevu
tamidom̐ bĕddariga miṁtagu vachchĕnu
amara śhrīvĕṁkaḍeśha ālamelmaṁgam̐ gūḍidi
jamaḽi nannelidi vāsadi sĕppĕm̐gā