Sooseyatti selulellaa sodyamamderu

చూచేయట్టి చెలులెల్లా సోద్యమందేరు
Language

(॥పల్లవి॥)
చూచేయట్టి చెలులెల్లా సోద్యమందేరు
చేచేత మీమోహములే చెప్పిచూపీఁగదవే

(॥చూచే॥)
పంతము లాతఁ డాడగ పక్కన నీవు నవ్వఁగా
వింతగాఁ జెమట వెల్లివిరిసీఁగదె
మంతనపుఁజేఁత లివి మరొక రెఱఁగరాదు
బంతి మీ సరసములు పచ్చి దేరీఁగదవే

(॥చూచే॥)
చేరి యాతఁడు చూడఁగ సిగ్గులు నీవు చల్లఁగా
సారె మోమునఁ గళలు జడిసీఁగదే
తారుకాణఁ బెట్టరాదు తగవు దేరుచరాదు
కూరిము లిద్దరివిని కుప్పలాయఁగదవే

(॥చూచే॥)
శ్రీవేంకటేశుఁ డంటఁగా జిగిఁ జన్నుల నొత్తఁగా
కోవరపుతత్తరాలు గురిసెఁగదే
యీవేళఁ గూడితిరి మిమ్మేమీ ననఁగరాదు
తావుల మీరతులెల్లా దైవారీఁగదవే

(||pallavi||)
sūseyaṭṭi sĕlulĕllā sodyamaṁderu
seseda mīmohamule sĕppisūbīm̐gadave

(||sūse||)
paṁtamu lādam̐ ḍāḍaga pakkana nīvu navvam̐gā
viṁtagām̐ jĕmaḍa vĕllivirisīm̐gadĕ
maṁtanabum̐jem̐ta livi marŏga rĕṟam̐garādu
baṁti mī sarasamulu pachchi derīm̐gadave

(||sūse||)
seri yādam̐ḍu sūḍam̐ga siggulu nīvu sallam̐gā
sārĕ momunam̐ gaḽalu jaḍisīm̐gade
tārugāṇam̐ bĕṭṭarādu tagavu derusarādu
kūrimu liddarivini kuppalāyam̐gadave

(||sūse||)
śhrīveṁkaḍeśhum̐ ḍaṁṭam̐gā jigim̐ jannula nŏttam̐gā
kovarabudattarālu gurisĕm̐gade
yīveḽam̐ gūḍidiri mimmemī nanam̐garādu
tāvula mīradulĕllā daivārīm̐gadave