చూచేవారికిఁ గలిమి సుఖమే తోఁచుఁ గాని
(॥పల్లవి॥)
చూచేవారికిఁ గలిమి సుఖమే తోఁచుఁ గాని
యేచి కావడి మోచేవాఁ డెఱుఁగునా వేఁగు
(॥చూచే॥)
పక్కెరగుఱ్ఱముఁ గంటే పరులకే సింగారము
గుక్కక దానికే మోపు గుడ్లకొలఁది
కిక్కిఱిసి యధికువాకిట నుండు సిరు లెల్లా
వెక్కసమై యానుకొన వేసటేను నాతనికి
(॥చూచే॥)
గడా టాడేవానిఁ గంటే కన్నవారికి వేడుక
అడుగడుగు ప్రయాస మటు వానికి
బడినుండుఁ జతురంగబలములుదొరకును
చిడిముడి శత్రులపై చింతే యాతనికి
(॥చూచే॥)
పాములవానిఁ గంటే పడుచుల కానందము
వోముచుఁ బ్రాణము వట్టుకుండు నాతఁడు
యీమేర శ్రీవేంకటేశ యిల్లెల్లాఁ బైఁడి ఘనున
కామెయి భోగించ దీర దాతని కేపొద్దును
(||pallavi||)
sūsevārigim̐ galimi sukhame tom̐sum̐ gāni
yesi kāvaḍi mosevām̐ ḍĕṟum̐gunā vem̐gu
(||sūse||)
pakkĕraguṭramum̐ gaṁṭe parulage siṁgāramu
gukkaga dānige mobu guḍlagŏlam̐di
kikkiṟisi yadhiguvāgiḍa nuṁḍu siru lĕllā
vĕkkasamai yānugŏna vesaḍenu nādanigi
(||sūse||)
gaḍā ṭāḍevānim̐ gaṁṭe kannavārigi veḍuga
aḍugaḍugu prayāsa maḍu vānigi
baḍinuṁḍum̐ jaduraṁgabalamuludŏragunu
siḍimuḍi śhatrulabai siṁte yādanigi
(||sūse||)
pāmulavānim̐ gaṁṭe paḍusula kānaṁdamu
vomusum̐ brāṇamu vaṭṭuguṁḍu nādam̐ḍu
yīmera śhrīveṁkaḍeśha yillĕllām̐ baim̐ḍi ghanuna
kāmĕyi bhogiṁcha dīra dādani kebŏddunu