చూచేవారికి ధర్మము సులభమువలె నుండు
(॥పల్లవి॥)
చూచేవారికి ధర్మము సులభమువలె నుండు
కాచి నమ్మి చేకొంటే ఘనునిఁగాఁ జేసును
(॥చూచే॥)
అరియ శ్రీపాదతీర్థ మల్పమువలె నుండు
వరుఁసఁ బాపములను వక్కలించును
వొరసి నీ నామ మొక్క మాటవలె నుండును
నరకములు తరించి నంటున రక్షించును
(॥చూచే॥)
మహి నీ పూజ తులసీదళమాత్రమువలె నుండును
యిహపరములు దానే యియ్య నోవును
అహరహము నీ చింత ఆందోళమువలె నుండును
విహితమై నీ కృపకు వెఁసఁ బాత్రుఁ జేసును
(॥చూచే॥)
చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలువలె నుండు
దారుణిలో భవవార్ధి దాఁటించును
వూరకే నీ కిచ్చే కానుక వొక కాసువలె నుండును
యీరీతి శ్రీవేంకటేశ యే వరమైనా నొసఁగును
(||pallavi||)
sūsevārigi dharmamu sulabhamuvalĕ nuṁḍu
kāsi nammi segŏṁṭe ghanunim̐gām̐ jesunu
(||sūse||)
ariya śhrībādadīrdha malbamuvalĕ nuṁḍu
varum̐sam̐ bābamulanu vakkaliṁchunu
vŏrasi nī nāma mŏkka māḍavalĕ nuṁḍunu
naragamulu tariṁchi naṁṭuna rakṣhiṁchunu
(||sūse||)
mahi nī pūja tulasīdaḽamātramuvalĕ nuṁḍunu
yihabaramulu dāne yiyya novunu
aharahamu nī siṁta āṁdoḽamuvalĕ nuṁḍunu
vihidamai nī kṛpagu vĕm̐sam̐ bātrum̐ jesunu
(||sūse||)
seri nīgu mŏkke mŏkkulu seṣhṭaluvalĕ nuṁḍu
dāruṇilo bhavavārdhi dām̐ṭiṁchunu
vūrage nī kichche kānuga vŏga kāsuvalĕ nuṁḍunu
yīrīdi śhrīveṁkaḍeśha ye varamainā nŏsam̐gunu