చూచేవారికెల్లాను చూడఁ గొత్తలు
(॥పల్లవి॥)
చూచేవారికెల్లాను చూడఁ గొత్తలు
యేచిన మీ మహిమలు యేమిచెప్పే దపుడు
(॥చూచే॥)
గందము నీవు చల్లఁగా కాంత సరసమాడఁగా
చందమామ మీచేఁతలు సరికి బేసి
విందునీ కాపె చెప్పెఁగా వెస నీ వియ్యకొనఁగా
ఇందరిలో మీసంతోసా లేమి చెప్పే దవుడు
(॥చూచే॥)
ఆయములు నీవంటఁగా ఆపె నవ్వులు నవ్వఁగా
చాయకు వచ్చె వలపు సాటికి బేటి
కాయ మాపె వొరయఁగా కన్నుల నీవు చొక్కఁగా
యీయెడ వినోదము లేమిచెప్పే దవుడు
(॥చూచే॥)
సరుగ నీవు గూడగా చన్నుల నాపె వొత్తగా
ఇరవాయ సమరతు లీడకు నీడు
సరి శ్రీ వేంకటేశ్వర సన్నలు మీలోఁ జేయఁగా
యెరవులే దెరిగితి మేమి చెప్పేదపుడు.
(||pallavi||)
sūsevārigĕllānu sūḍam̐ gŏttalu
yesina mī mahimalu yemisĕppe dabuḍu
(||sūse||)
gaṁdamu nīvu sallam̐gā kāṁta sarasamāḍam̐gā
saṁdamāma mīsem̐talu sarigi besi
viṁdunī kābĕ sĕppĕm̐gā vĕsa nī viyyagŏnam̐gā
iṁdarilo mīsaṁtosā lemi sĕppe davuḍu
(||sūse||)
āyamulu nīvaṁṭam̐gā ābĕ navvulu navvam̐gā
sāyagu vachchĕ valabu sāḍigi beḍi
kāya mābĕ vŏrayam̐gā kannula nīvu sŏkkam̐gā
yīyĕḍa vinodamu lemisĕppe davuḍu
(||sūse||)
saruga nīvu gūḍagā sannula nābĕ vŏttagā
iravāya samaradu līḍagu nīḍu
sari śhrī veṁkaḍeśhvara sannalu mīlom̐ jeyam̐gā
yĕravule dĕrigidi memi sĕppedabuḍu.