చూచేవారికే యివి సోద్యా లింతేకాక
(॥పల్లవి॥)
చూచేవారికే యివి సోద్యా లింతేకాక
యేచి నీకయితే యివి యింపులే కావా
(॥చూచే॥)
సారె సారె నాడేటిసవతుల జగడాలు
నారుకొన వింటే నీకు నవ్వులు గావా
చేరిచేరి వొండొరులు చేపట్లకుఁ జొచ్చితే
సైరణతో వినోదించఁ జవులు గావా
(॥చూచే॥)
కొలువులోని ఇంతులు గొణఁగి తిట్లాడితే
అలరి నీకుఁ జెర్లాటా లివియె కావా
వొలసి నీమీఁదఁ బెట్టి వొట్లు వెట్టుకొంటే
చెలరేఁగి నీకు విన సిగ్గులు గావా
(॥చూచే ॥)
నీపెండ్లికూఁతు లిద్దరు నిన్ను సాకిరడిగితే
పై పై నీవుచేసినభాగ్యముగాదా
యేపున శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
రాఁపుగాఁ గూడితి నీరపము గాదా
(||pallavi||)
sūsevārige yivi sodyā liṁtegāga
yesi nīgayide yivi yiṁpule kāvā
(||sūse||)
sārĕ sārĕ nāḍeḍisavadula jagaḍālu
nārugŏna viṁṭe nīgu navvulu gāvā
seriseri vŏṁḍŏrulu sebaṭlagum̐ jŏchchide
sairaṇado vinodiṁcham̐ javulu gāvā
(||sūse||)
kŏluvuloni iṁtulu gŏṇam̐gi tiṭlāḍide
alari nīgum̐ jĕrlāḍā liviyĕ kāvā
vŏlasi nīmīm̐dam̐ bĕṭṭi vŏṭlu vĕṭṭugŏṁṭe
sĕlarem̐gi nīgu vina siggulu gāvā
(||sūse ||)
nībĕṁḍligūm̐tu liddaru ninnu sāgiraḍigide
pai pai nīvusesinabhāgyamugādā
yebuna śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
rām̐pugām̐ gūḍidi nīrabamu gādā