Soosemugaa yaadaleni suddulellam jeppanela

చూచేముగా యాడలేని సుద్దులెల్లఁ జెప్పనేల
Language

(॥పల్లవి॥)
చూచేముగా యాడలేని సుద్దులెల్లఁ జెప్పనేల
యేచి పంతాలు మెరచే రెవ్వ రిఁక బలువో

(॥చూచే॥)
పడఁతిచన్ను మొనలు పచ్చితామరననలు
అడరుఁజూపులు మరునంపకొనలు
తడవే వా పెను నీవు తతిగొని పెనఁగేవు
యెడయక యిద్దరిలో నెవ్వ రింక బలువొ

(॥చూచే॥)
అంగననునుఁగురు లట్టె మోహపుటురులు
సింగారపుఁగురులు మించినతరులు
అంగవించి సారెసారె నాపె నీవు చెన కేవు
ఇంగితాన నెంచి చూడ నెవ్వ రిఁక బలువో

(॥చూచే॥)
కప్పురగందిమోవి కమ్మనితేనెతావి
చెప్పరానిపిరుఁదిది చేకొన్నదీవి
ముప్పిరి శ్రీవేంకటేశ మున్నె నన్నుఁ గూడితివి
యిప్పుడాపెఁ దడవేవు యెవ్వ రింక బలువో

(||pallavi||)
sūsemugā yāḍaleni suddulĕllam̐ jĕppanela
yesi paṁtālu mĕrase rĕvva rim̐ka baluvo

(||sūse||)
paḍam̐tisannu mŏnalu pachchidāmarananalu
aḍarum̐jūbulu marunaṁpagŏnalu
taḍave vā pĕnu nīvu tadigŏni pĕnam̐gevu
yĕḍayaga yiddarilo nĕvva riṁka baluvŏ

(||sūse||)
aṁgananunum̐guru laṭṭĕ mohabuḍurulu
siṁgārabum̐gurulu miṁchinadarulu
aṁgaviṁchi sārĕsārĕ nābĕ nīvu sĕna kevu
iṁgidāna nĕṁchi sūḍa nĕvva rim̐ka baluvo

(||sūse||)
kappuragaṁdimovi kammanidenĕdāvi
sĕpparānibirum̐didi segŏnnadīvi
muppiri śhrīveṁkaḍeśha munnĕ nannum̐ gūḍidivi
yippuḍābĕm̐ daḍavevu yĕvva riṁka baluvo