Sooduvugaa nee yaamelu sompulugaanu

చూతువుగా నీ యామేలు సొంపులుగాను
Language

(॥పల్లవి॥)
చూతువుగా నీ యామేలు సొంపులుగాను
కాతరాన లోనికి రాఁగదవయ్య ఇపుడు

(॥॥)
మొక్కలాన దవ్వులనే మోము చూచి నవ్వితేనే
చెక్కులెల్లాఁ బులకించె చెలియకును
చక్కనిచన్ను లంటితే చవులేమి వుట్టునో
గక్కనఁ బాన్పుపైకి రాఁగదవయ్య ఇపుడు

(॥॥)
పోలసి యల్లంతనుండి పూఁచి మాటలాడితేను
చెలపచెమట గారెఁ జెలిమేనను
యెలమిఁ గతచెప్పితే నింపు లెట్టు వొడమునో
కలికి సంగడికి రాఁగదవయ్య ఇపుడు

(॥॥)
తమకించి ఇంతనంతఁ దప్పక చూచితేను
అమరెఁ జెలిమోమున అట్టెకళలు
జమళి శ్రీ వేంకటేశ సమరతిఁ గూడితివి
కమలాక్షియంకెకు రాఁగదవయ్య ఇపుడు

(||pallavi||)
sūduvugā nī yāmelu sŏṁpulugānu
kādarāna lonigi rām̐gadavayya ibuḍu

(||||)
mŏkkalāna davvulane momu sūsi navvidene
sĕkkulĕllām̐ bulagiṁchĕ sĕliyagunu
sakkanisannu laṁṭide savulemi vuṭṭuno
gakkanam̐ bānpubaigi rām̐gadavayya ibuḍu

(||||)
polasi yallaṁtanuṁḍi pūm̐si māḍalāḍidenu
sĕlabasĕmaḍa gārĕm̐ jĕlimenanu
yĕlamim̐ gadasĕppide niṁpu lĕṭṭu vŏḍamuno
kaligi saṁgaḍigi rām̐gadavayya ibuḍu

(||||)
tamagiṁchi iṁtanaṁtam̐ dappaga sūsidenu
amarĕm̐ jĕlimomuna aṭṭĕgaḽalu
jamaḽi śhrī veṁkaḍeśha samaradim̐ gūḍidivi
kamalākṣhiyaṁkĕgu rām̐gadavayya ibuḍu