చూతువు విచ్చేయవయ్య సొరిది విరహమిది
(॥పల్లవి॥)
చూతువు విచ్చేయవయ్య సొరిది విరహమిది
చేత నీకు విన్నపము సేసేయట్టే వున్నది
(॥చతు॥)
చెక్కునఁ బెట్టిన చెయి చేరఁడేసి కన్నులకు
యిక్కువ చెప్పినయట్టు యింతికున్నది
మిక్కిలి కస్తూరిపట్టు మించు మోవి చంద్రునికి
దిక్కుల విహరించే రాతిరివలెనున్నది
(॥చతు॥)
పూవులపానుపు మీఁదఁ బొరలేటి చెలిబాగు
వావి నీకుఁబెట్టే సేసవలెనున్నది
యీవల తుమ్మిద కురులిట్టే చెదరివుండఁగ
వేవేలకు మరుదండు విడిదలై యున్నది
(॥చతు॥)
కడుఁ దాపమునకుఁగా గందము పూసినపూఁత
వడి వలపుల వెల్లి వలెనున్నది
యెడయక శ్రీ వెంకటేశయీకెఁ గూడితివి
నడుకొత్తి నిచ్చకల్యాణమువలెనున్నది
(||pallavi||)
sūduvu vichcheyavayya sŏridi virahamidi
seda nīgu vinnabamu seseyaṭṭe vunnadi
(||sadu||)
sĕkkunam̐ bĕṭṭina sĕyi seram̐ḍesi kannulagu
yikkuva sĕppinayaṭṭu yiṁtigunnadi
mikkili kastūribaṭṭu miṁchu movi saṁdrunigi
dikkula vihariṁche rādirivalĕnunnadi
(||sadu||)
pūvulabānubu mīm̐dam̐ bŏraleḍi sĕlibāgu
vāvi nīgum̐bĕṭṭe sesavalĕnunnadi
yīvala tummida kuruliṭṭe sĕdarivuṁḍam̐ga
vevelagu marudaṁḍu viḍidalai yunnadi
(||sadu||)
kaḍum̐ dābamunagum̐gā gaṁdamu pūsinabūm̐ta
vaḍi valabula vĕlli valĕnunnadi
yĕḍayaga śhrī vĕṁkaḍeśhayīgĕm̐ gūḍidivi
naḍugŏtti nichchagalyāṇamuvalĕnunnadi