చూతువు రావయ్యా సుదతి నిట్టే
(॥పల్లవి॥)
చూతువు రావయ్యా సుదతి నిట్టే
కాతరము లన్నియును గంపఁబెట్టీ నదివో
(॥॥)
చెమ్మఁజెమటల చేతఁ జిప్పిలి నీపై వలపు-
లుమ్మగిలఁ బెట్టుకున్న దువిద
కుమ్మరింపుఁ బులకలఁ గోరికె లీరికెలెత్తి
దిమ్ము రేఁచి తమకము తెట్టెవెట్టీ నదివో
(॥॥)
వాడికె వూర్పులచేత వడి నీపె కాఁతాళము
కూడ పోసీ నదివో కోమలి
జాడుఁ జూపుల తోడుత జవ్వన మదములెల్ల
మేడెముగాఁ బన్ని పన్ని మేడగట్టీ నదివో
(॥॥)
సెలవి నవ్వులతోడ సిగ్గుల రతుల నీకు
కలయఁబెట్టీ నదె కలికి
యెలమి శ్రీవేంకటేశ యేలితివి యింతి నిట్టే
తొలగని సంతోసాలు దొడ్డిఁబెట్టీ నదివో
(||pallavi||)
sūduvu rāvayyā sudadi niṭṭe
kādaramu lanniyunu gaṁpam̐bĕṭṭī nadivo
(||||)
sĕmmam̐jĕmaḍala sedam̐ jippili nībai valabu-
lummagilam̐ bĕṭṭugunna duvida
kummariṁpum̐ bulagalam̐ gorigĕ līrigĕlĕtti
dimmu rem̐si tamagamu tĕṭṭĕvĕṭṭī nadivo
(||||)
vāḍigĕ vūrbulaseda vaḍi nībĕ kām̐tāḽamu
kūḍa posī nadivo komali
jāḍum̐ jūbula toḍuda javvana madamulĕlla
meḍĕmugām̐ banni panni meḍagaṭṭī nadivo
(||||)
sĕlavi navvuladoḍa siggula radula nīgu
kalayam̐bĕṭṭī nadĕ kaligi
yĕlami śhrīveṁkaḍeśha yelidivi yiṁti niṭṭe
tŏlagani saṁtosālu dŏḍḍim̐bĕṭṭī nadivo