Sooduvu raavayyaa sudadi laagu

చూతువు రావయ్యా సుదతి లాగు
Language

(॥పల్లవి॥)
చూతువు రావయ్యా సుదతి లాగు
చేతిమీఁది చెక్కుతోడ సిగ్గువడి వున్నది

(॥చతు॥)
చెప్పరానిమాటలు చెలి విన్నవించరాక
వుప్పతిల్లువలపుల నూరకున్నది
ఇప్పడు నీవే విచ్చేసి యేకతాన నన్నీ విను
దప్పిదేరే మోముతోడ తలవంచుకున్నది

(॥చతు॥)
భావములో కోరికలు బయలుసేయఁగ రాక
సోవలచెమటతోడ జొబ్బిలున్నది
వోవరిలోనికి వచ్చి వొరసి నీవే యడుగు
కావిరి నివ్వెరఁగులఁ గమ్ముకొని వున్నది

(॥చతు॥)
రతిలో రహస్యములు రవ్వలుసేయఁగ రాక
అతితమకముతోడ నలశున్నది
తతి శ్రీవేంకటేశుఁడ దండనుండి కూడితివి
మతి నీవే యాసపపడి మంచముపై నున్నది

(||pallavi||)
sūduvu rāvayyā sudadi lāgu
sedimīm̐di sĕkkudoḍa sigguvaḍi vunnadi

(||sadu||)
sĕpparānimāḍalu sĕli vinnaviṁcharāga
vuppadilluvalabula nūragunnadi
ippaḍu nīve vichchesi yegadāna nannī vinu
dappidere momudoḍa talavaṁchugunnadi

(||sadu||)
bhāvamulo korigalu bayaluseyam̐ga rāga
sovalasĕmaḍadoḍa jŏbbilunnadi
vovarilonigi vachchi vŏrasi nīve yaḍugu
kāviri nivvĕram̐gulam̐ gammugŏni vunnadi

(||sadu||)
radilo rahasyamulu ravvaluseyam̐ga rāga
adidamagamudoḍa nalaśhunnadi
tadi śhrīveṁkaḍeśhum̐ḍa daṁḍanuṁḍi kūḍidivi
madi nīve yāsabapaḍi maṁchamubai nunnadi