చూతుఁబో అప్పుడు నీ సుగుడతనము లెల్లా
(॥పల్లవి॥)
చూతుఁబో అప్పుడు నీ సుగుడతనము లెల్లా
కాతరాన నేఁ దిట్టితేఁ గాదనఁగలవా
(॥చతుఁ॥)
ఆవులమందకు రాఁగా నాయము లంటితిగాక
మావిటికి వచ్చి నీవు మమ్ముఁ జేసేవా
తోవనుండి నాకాలు దొక్కితి వింతేకాక
చేవదేర నేకతాన సేవ సేయఁగలవా
(॥చతుఁ॥)
చల్లలమ్మ రాఁగానే సరసమాడేవు గాక
గొల్లపల్లె లోను చొచ్చి కొంగువట్టేవా
చెల్లఁబో యమునలోన సిగ్గులు వరచితిగాక
పల్లదాన రతివేళ బలిమి చుపేవా
(॥చతుఁ॥)
అంకులు వెట్టించుకోఁగా నండ వచ్చితిగాక
లంకెలఁ బెనఁగితేను లావు చూపేవా
యింకనేల శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
కొంకుదేరె నిఁక నీవు కొఱఁత సేసేవా
(||pallavi||)
sūdum̐bo appuḍu nī suguḍadanamu lĕllā
kādarāna nem̐ diṭṭidem̐ gādanam̐galavā
(||sadum̐||)
āvulamaṁdagu rām̐gā nāyamu laṁṭidigāga
māviḍigi vachchi nīvu mammum̐ jesevā
tovanuṁḍi nāgālu dŏkkidi viṁtegāga
sevadera negadāna seva seyam̐galavā
(||sadum̐||)
sallalamma rām̐gāne sarasamāḍevu gāga
gŏllaballĕ lonu sŏchchi kŏṁguvaṭṭevā
sĕllam̐bo yamunalona siggulu varasidigāga
palladāna radiveḽa balimi subevā
(||sadum̐||)
aṁkulu vĕṭṭiṁchugom̐gā naṁḍa vachchidigāga
laṁkĕlam̐ bĕnam̐gidenu lāvu sūbevā
yiṁkanela śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
kŏṁkuderĕ nim̐ka nīvu kŏṟam̐ta sesevā