చూడుమా నీవెఱఁగని సుద్దు లున్నవా
(॥పల్లవి॥)
చూడుమా నీవెఱఁగని సుద్దు లున్నవా
యేడ నున్నదో నీచిత్త మేమందు నీతోను
(॥చూడు॥)
నగరాదు నీతోను నన్ను నిది యేఁటికని
అగడుగాఁ జెప్పుమంటా నానవెట్టేవు
నిగిడి నీభావము నీకు నీకే తెలుసుకో
యెగసక్కేలాడ నేర యేమందు నీతోను
(॥చూడు॥)
కన్ను సన్న సేయరాదు కాంతలతో నది నీకు
విన్నవించుమని నన్ను వేఁడుకొనేవు
యిన్నియు నీవే యడుగు ఇరుఁగు పొరుగువారి
యెన్ననేర నీగుణాలు యేమందు నీతోను
(॥చూడు॥)
చంగనఁ బొగడరాదు సారె సారె నన్ను నీవు
వెంగెమో నిజమో యంటా విచారించేవు
చెంగటఁ గూడితి విట్టె శ్రీ వేంకటేశ నన్ను
యింగితా లలమేల్మంగ నేమందు నీతోను
(||pallavi||)
sūḍumā nīvĕṟam̐gani suddu lunnavā
yeḍa nunnado nīsitta memaṁdu nīdonu
(||sūḍu||)
nagarādu nīdonu nannu nidi yem̐ṭigani
agaḍugām̐ jĕppumaṁṭā nānavĕṭṭevu
nigiḍi nībhāvamu nīgu nīge tĕlusugo
yĕgasakkelāḍa nera yemaṁdu nīdonu
(||sūḍu||)
kannu sanna seyarādu kāṁtalado nadi nīgu
vinnaviṁchumani nannu vem̐ḍugŏnevu
yinniyu nīve yaḍugu irum̐gu pŏruguvāri
yĕnnanera nīguṇālu yemaṁdu nīdonu
(||sūḍu||)
saṁganam̐ bŏgaḍarādu sārĕ sārĕ nannu nīvu
vĕṁgĕmo nijamo yaṁṭā visāriṁchevu
sĕṁgaḍam̐ gūḍidi viṭṭĕ śhrī veṁkaḍeśha nannu
yiṁgidā lalamelmaṁga nemaṁdu nīdonu