సూడుబంటునే బలాలు చూపించ వచ్చితిమిదె
(॥పల్లవి॥)
సూడుబంటునే బలాలు చూపించ వచ్చితిమిదె
యీడ మనమే కూళల మీతఁడేమి సేసునే
(॥సూడు॥)
నగ నేరిచినవాఁడు నాలికాఁడు మనవాఁడు
తెగనీఁడు యెంతైనాఁ దేరనీఁడు
వెగటున మనమే వెఱ్ఱివారమై యిందాఁక
జగడించితిమి గాక చాలుఁ జాలుఁ బదవే
(॥సూడు॥)
కడురాజసపువాఁడు గామిడివాఁడు మనల-
నొడఁ బరచఁడు మాటకుత్తరమీఁడు
అడియాసలనూరకే అండనుంటిమింతె కాక
గొడవకాఁడితఁడు కూడనీఁడు పదవే
(॥సూడు॥)
ఇద్దరినడిమివాఁడు ఇచ్చకుఁడు మనమంకు
తిద్దలేఁడు లోపలికి తెగిపోనీఁడు
గద్దరీఁడు శ్రీవేంకటఘనుఁడొకరొకరినే
వొద్దికతోఁ గూడెనింక నొక్కటైతిఁ బదవే
(||pallavi||)
sūḍubaṁṭune balālu sūbiṁcha vachchidimidĕ
yīḍa maname kūḽala mīdam̐ḍemi sesune
(||sūḍu||)
naga nerisinavām̐ḍu nāligām̐ḍu manavām̐ḍu
tĕganīm̐ḍu yĕṁtainām̐ deranīm̐ḍu
vĕgaḍuna maname vĕṭrivāramai yiṁdām̐ka
jagaḍiṁchidimi gāga sālum̐ jālum̐ badave
(||sūḍu||)
kaḍurājasabuvām̐ḍu gāmiḍivām̐ḍu manala-
nŏḍam̐ barasam̐ḍu māḍaguttaramīm̐ḍu
aḍiyāsalanūrage aṁḍanuṁṭimiṁtĕ kāga
gŏḍavagām̐ḍidam̐ḍu kūḍanīm̐ḍu padave
(||sūḍu||)
iddarinaḍimivām̐ḍu ichchagum̐ḍu manamaṁku
tiddalem̐ḍu lobaligi tĕgibonīm̐ḍu
gaddarīm̐ḍu śhrīveṁkaḍaghanum̐ḍŏgarŏgarine
vŏddigadom̐ gūḍĕniṁka nŏkkaḍaidim̐ badave