సూటిగాఁ దప్పక మోము చూడవయ్యా
(॥పల్లవి॥)
సూటిగాఁ దప్పక మోము చూడవయ్యా
చాటున నీ విందుకెంత జడిసివుండేవు
(॥సూటి॥)
జిగిమించు సిగ్గులేల సెలవుల నవ్వులేల
మగువతో మొగమెత్తి మాటాడరాదా
యెగసక్కేలకు నిన్ను యేమీ నన్నది గాదు
నిగిడి ఇంతిలోనే నీవేల లోఁగేవు
(॥సూటి॥)
ముంగిటివెరపులేల మొగమోట యింతయేల
అంగన యిచ్చినకాను కందుకోరాదా
వెంగేనకు నిన్ను నీకె వెస రట్టుసేయదు
చెంగట నీ విందుకేల చింతించుకొనేవు
(॥సూటి॥)
బట్టబయ లీఁదనేల భావించుకొననేల
గుట్టుతో నాపె నిట్టె కూడఁగరాదా
రట్టుగా శ్రీవేంకటేశ యిట్టె యాపె పంగించదు
మట్టుతో నేలితి వనుమానించనేమిటికి
(||pallavi||)
sūḍigām̐ dappaga momu sūḍavayyā
sāḍuna nī viṁdugĕṁta jaḍisivuṁḍevu
(||sūḍi||)
jigimiṁchu siggulela sĕlavula navvulela
maguvado mŏgamĕtti māḍāḍarādā
yĕgasakkelagu ninnu yemī nannadi gādu
nigiḍi iṁtilone nīvela lom̐gevu
(||sūḍi||)
muṁgiḍivĕrabulela mŏgamoḍa yiṁtayela
aṁgana yichchinagānu kaṁdugorādā
vĕṁgenagu ninnu nīgĕ vĕsa raṭṭuseyadu
sĕṁgaḍa nī viṁdugela siṁtiṁchugŏnevu
(||sūḍi||)
baṭṭabaya līm̐danela bhāviṁchugŏnanela
guṭṭudo nābĕ niṭṭĕ kūḍam̐garādā
raṭṭugā śhrīveṁkaḍeśha yiṭṭĕ yābĕ paṁgiṁchadu
maṭṭudo nelidi vanumāniṁchanemiḍigi