Soodigaa nannemi soosevu

సూటిగా నన్నేమి చూచేవు
Language

(॥పల్లవి॥)
సూటిగా నన్నేమి చూచేవు
నీటుతోడ నన్నీ నేరుపవయ్యా

(॥॥)
నవ్వుతా నిన్ను నాయము లడిగీ-
నెవ్వతో ఆనతి యియ్యవయ్యా
జవ్వని యప్పటి సరిబేసులాడీ
వువ్విళ్లూరఁ బందే లోగి వేయవయ్యా

(॥॥)
మచ్చికతోడుత మనవి చెప్పీ
విచ్చనవిడిని వినవయ్యా
వచ్చి యాపె నీతో వసంతమాడీ
పచ్చివలపులు పైఁ జల్లవయ్యా

(॥॥)
పలుమరు నీపైఁ బాటలు వాడీ
మెలుపున నిట్టె మెచ్చవయ్యా
అలమేలుమంగనైన నన్నేలితి-
వెలమి శ్రీ వేంకటేశ నేఁడయ్యా

(||pallavi||)
sūḍigā nannemi sūsevu
nīḍudoḍa nannī nerubavayyā

(||||)
navvudā ninnu nāyamu laḍigī-
nĕvvado ānadi yiyyavayyā
javvani yappaḍi saribesulāḍī
vuvviḽlūram̐ baṁde logi veyavayyā

(||||)
machchigadoḍuda manavi sĕppī
vichchanaviḍini vinavayyā
vachchi yābĕ nīdo vasaṁtamāḍī
pachchivalabulu paim̐ jallavayyā

(||||)
palumaru nībaim̐ bāḍalu vāḍī
mĕlubuna niṭṭĕ mĕchchavayyā
alamelumaṁganaina nannelidi-
vĕlami śhrī veṁkaḍeśha nem̐ḍayyā