చూడవోయి వలపెంత చొక్కులఁబెట్టే నన్ను
(॥పల్లవి॥)
చూడవోయి వలపెంత చొక్కులఁబెట్టే నన్ను
వేడుకలు మీఁద మీఁద వెదచల్లీ నిపుడు
(॥చూడ॥)
కోరి నీవు రాకుండఁగా కోపము రావలదా
వారక యాలోన నవ్వు వచ్చీఁగాక
గోర గీరఁగా నిన్ను గుంపించఁగవలదా
గారవపు నామనసు గరఁగీఁగాక
(॥చూడ॥)
వుద్దరండాలు సేయఁగాను వొట్టు వెట్టవలదా
కొద్దితో నా గుణ మియ్యకొనీఁగాక
బద్దుల వినయాలకు పంగించవలదా
అద్దో నా వయసు ని న్నాసనడీఁగాక
(॥చూడ॥)
కడల నీ సుద్దులకుఁ గాఁతాళించవలదా
పొడము పులకలమై పొదలీఁగాక
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
జడియవలదా దతి చవిరేఁచీఁగాక
(||pallavi||)
sūḍavoyi valabĕṁta sŏkkulam̐bĕṭṭe nannu
veḍugalu mīm̐da mīm̐da vĕdasallī nibuḍu
(||sūḍa||)
kori nīvu rāguṁḍam̐gā kobamu rāvaladā
vāraga yālona navvu vachchīm̐gāga
gora gīram̐gā ninnu guṁpiṁcham̐gavaladā
gāravabu nāmanasu garam̐gīm̐gāga
(||sūḍa||)
vuddaraṁḍālu seyam̐gānu vŏṭṭu vĕṭṭavaladā
kŏddido nā guṇa miyyagŏnīm̐gāga
baddula vinayālagu paṁgiṁchavaladā
addo nā vayasu ni nnāsanaḍīm̐gāga
(||sūḍa||)
kaḍala nī suddulagum̐ gām̐tāḽiṁchavaladā
pŏḍamu pulagalamai pŏdalīm̐gāga
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
jaḍiyavaladā dadi savirem̐sīm̐gāga