చూడవో(వే?) వట్టివలపు సూటిఁ బడీనా
(॥పల్లవి॥)
చూడవో(వే?) వట్టివలపు సూటిఁ బడీనా
వేడుకల కెంతైనా వెల వున్నదా
(॥చూడ॥)
సేయవే నీ వాతనికి సేవలెల్లాను
చాయకు నేఁ జేయఁ బోతేఁ జవిగాదు
నీయంతచన వున్నదా నేఁడు మాకు
కాయకము లెల్లాను కరఁచీనా మనసు
(॥చూడ॥)
నగవే నీ వాతనితో నయముగాను
తగులు లేనిచోటఁ దమి వుట్టీనా
పగటున నీయంతబలు వున్నదా
పొగరులమాఁట లెల్లాఁ బొందు సేసీనా
(॥చూడ॥)
కలయవే నీ వాతనికాఁగిట నిట్టె
పిలువని పేరటాలు ప్రియము లౌనా
వలె నని శ్రీ వేంకటవల్లభుఁడు తానె కూడె
నిలుకడైనమీఁద నిజమే కాదా
(||pallavi||)
sūḍavo(ve?) vaṭṭivalabu sūḍim̐ baḍīnā
veḍugala kĕṁtainā vĕla vunnadā
(||sūḍa||)
seyave nī vādanigi sevalĕllānu
sāyagu nem̐ jeyam̐ bodem̐ javigādu
nīyaṁtasana vunnadā nem̐ḍu māgu
kāyagamu lĕllānu karam̐sīnā manasu
(||sūḍa||)
nagave nī vādanido nayamugānu
tagulu lenisoḍam̐ dami vuṭṭīnā
pagaḍuna nīyaṁtabalu vunnadā
pŏgarulamām̐ṭa lĕllām̐ bŏṁdu sesīnā
(||sūḍa||)
kalayave nī vādanigām̐giḍa niṭṭĕ
piluvani peraḍālu priyamu launā
valĕ nani śhrī veṁkaḍavallabhum̐ḍu tānĕ kūḍĕ
nilugaḍainamīm̐da nijame kādā