చూడవే యీతఁడప్పటి సొలసీ నన్ను
(॥పల్లవి॥)
చూడవే యీతఁడప్పటి సొలసీ నన్ను
యేడ నేరిచినాఁడో యేమందునే
(॥॥)
చెక్కులు నొక్కుటయెల్లా సేస వెట్టుటకే కాదా
గక్కన విభునిచేఁత కంటివా చెలి
అక్కరతో మాటాడిన దాసపడుటేఁ(టకే?) కాదా
ఇక్కడ నేమారుమాట లేమందునే
(॥॥)
కప్పుర మిచ్చుటయెల్లా కదియవలనే కాదా
చిప్పిలీ నీతఁడు తెలిశితివా చెలి
దప్పిదేర నవ్వుటెల్లా తమకించుటకే కాదా
ఇప్పుడిట్టె వేగిరించి నేమందునే
(॥॥)
కనుసన్న సేయుటెల్లా కాఁగిలించుటకే కాదా
వినయము సేసీఁ దాను వింటివా చెలి
చెనకుచు మన్నించి శ్రీ వేంకటేశ్వరుఁడు
యెనసినాఁడిదె నన్ను నేమందునే
(||pallavi||)
sūḍave yīdam̐ḍappaḍi sŏlasī nannu
yeḍa nerisinām̐ḍo yemaṁdune
(||||)
sĕkkulu nŏkkuḍayĕllā sesa vĕṭṭuḍage kādā
gakkana vibhunisem̐ta kaṁṭivā sĕli
akkarado māḍāḍina dāsabaḍuḍem̐(ṭage?) kādā
ikkaḍa nemārumāḍa lemaṁdune
(||||)
kappura michchuḍayĕllā kadiyavalane kādā
sippilī nīdam̐ḍu tĕliśhidivā sĕli
dappidera navvuḍĕllā tamagiṁchuḍage kādā
ippuḍiṭṭĕ vegiriṁchi nemaṁdune
(||||)
kanusanna seyuḍĕllā kām̐giliṁchuḍage kādā
vinayamu sesīm̐ dānu viṁṭivā sĕli
sĕnagusu manniṁchi śhrī veṁkaḍeśhvarum̐ḍu
yĕnasinām̐ḍidĕ nannu nemaṁdune