Soodave yappadi nene joodari nada

చూడవే యప్పటి నేనే జూటరి నట
Language

(॥పల్లవి॥)
చూడవే యప్పటి నేనే జూటరి నట
జాడలు తాఁ గట్టిన పచ్చడమే యెరుఁగు

(॥చూడవే॥)
ముప్పిరిఁ దారా కుండఁగ ముసుఁగు వెట్టుక వుంటి
అప్పటినేనే కల్ల నటవే చూడు
నెప్పునఁ దమవొళ్లిది నేర మందురా యెవ్వరు
తప్పులు సేసిన వెల్లె దయ్య మెరుఁగుఁ గాక

(॥చూడమే॥)
యెయ్యడకో తాఁ బోఁగా నిందుకు రమ్మంటి నింతే
గయ్యాళి నేనే యట కమ్మటిఁ జూడు
నెయ్యమునఁ దనతోడ నిజము నా దేడ కెక్కు
అయ్యో తనవొళ్లికడ మాతుమే యెరుఁగూ

(॥చూడవే॥)
చెంత దాఁ బిలచుదాఁక సిగ్గున నుండితి నింతే
పంతము నాదే యట బలువు చూడు
యింతిరో శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
పొంతల తనతగవు పొరు గెల్లా నెరుఁగూ

(||pallavi||)
sūḍave yappaḍi nene jūḍari naḍa
jāḍalu tām̐ gaṭṭina pachchaḍame yĕrum̐gu

(||sūḍave||)
muppirim̐ dārā kuṁḍam̐ga musum̐gu vĕṭṭuga vuṁṭi
appaḍinene kalla naḍave sūḍu
nĕppunam̐ damavŏḽlidi nera maṁdurā yĕvvaru
tappulu sesina vĕllĕ dayya mĕrum̐gum̐ gāga

(||sūḍame||)
yĕyyaḍago tām̐ bom̐gā niṁdugu rammaṁṭi niṁte
gayyāḽi nene yaḍa kammaḍim̐ jūḍu
nĕyyamunam̐ danadoḍa nijamu nā deḍa kĕkku
ayyo tanavŏḽligaḍa mādume yĕrum̐gū

(||sūḍave||)
sĕṁta dām̐ bilasudām̐ka sigguna nuṁḍidi niṁte
paṁtamu nāde yaḍa baluvu sūḍu
yiṁtiro śhrīvĕṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
pŏṁtala tanadagavu pŏru gĕllā nĕrum̐gū