Soodave vo seliyaro jooda reedamdu

చూడవే వో చెలియరో జూట రీతఁడు
Language

(॥పల్లవి॥)
చూడవే వో చెలియరో జూట రీతఁడు
వేడుకలకు నవ్వులు వెదచల్లీ నీతఁడు

(॥చూడ॥)
వొప్పయిన తనవేలివుంగరము నీదె యంటె
అప్పటి నానాలువెట్టీ నౌనే యీతఁడు
కుప్పెతోడిసవరముగురుతు నేఁ బట్టితేను
తప్పకచూచీ నన్నుఁ దగునే తా నీతఁడు

(॥చూడ॥)
కట్టిన కంఠమారము కడుఁ గొత్త యిది యంటే
వట్టితుకాణలకు వచ్చీ నీతఁడు
కట్టుకొన్న దిది దట్టి గాదు చీర యంటే
యెట్టె యీవిగా నాకు నియ్య వచ్చీ నీతఁడు

(॥చూడ॥)
కేలనున్నపూబంతి భోగించినది యౌనంటే
సోలిఁ దననేమములే చూపీ నీతఁడు
కోలాటపు పతిమల గొప్పసుర టేడదంటే
వేళతో నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు

(||pallavi||)
sūḍave vo sĕliyaro jūḍa rīdam̐ḍu
veḍugalagu navvulu vĕdasallī nīdam̐ḍu

(||sūḍa||)
vŏppayina tanavelivuṁgaramu nīdĕ yaṁṭĕ
appaḍi nānāluvĕṭṭī naune yīdam̐ḍu
kuppĕdoḍisavaramugurudu nem̐ baṭṭidenu
tappagasūsī nannum̐ dagune tā nīdam̐ḍu

(||sūḍa||)
kaṭṭina kaṁṭhamāramu kaḍum̐ gŏtta yidi yaṁṭe
vaṭṭidugāṇalagu vachchī nīdam̐ḍu
kaṭṭugŏnna didi daṭṭi gādu sīra yaṁṭe
yĕṭṭĕ yīvigā nāgu niyya vachchī nīdam̐ḍu

(||sūḍa||)
kelanunnabūbaṁti bhogiṁchinadi yaunaṁṭe
solim̐ dananemamule sūbī nīdam̐ḍu
kolāḍabu padimala gŏppasura ṭeḍadaṁṭe
veḽado nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu