చూడవయ్యా నీసేఁతలు సూటిపడేను
(॥పల్లవి॥)
చూడవయ్యా నీసేఁతలు సూటిపడేను
ఆడరాదు నీతో మారు అవుఁగాదనుచును
(॥॥)
సరసములాడితివి చనవు లొసఁగితివి
తరుణితోడ నీవు తమకానను
యిరవై యీపె నోఁడు యేమిభాగ్యము సేసెనో
సిరులవలపులెల్లా చెక్కుల నిండెను
(॥॥)
సేవ సేయించుకొంటివి సిగ్గులు దేరిచితివి
భావించి వనిత నింత పనిగొంటివి
పావనమె తనజన్మఫల మదియెట్టిదో
చేవ దేరినవలపు మోవిమీఁద నున్నది
(॥॥)
గక్కనఁ బెండ్లాడితివి కాఁగిటఁ గూడితివి
మిక్కిలివేడుక నలమేలుమంగను
యిక్కవ శ్రీ వేంకటేశ యెటువంటితగులమో
చక్కనివలపులెల్లా చన్నులపై నున్నవి
(||pallavi||)
sūḍavayyā nīsem̐talu sūḍibaḍenu
āḍarādu nīdo māru avum̐gādanusunu
(||||)
sarasamulāḍidivi sanavu lŏsam̐gidivi
taruṇidoḍa nīvu tamagānanu
yiravai yībĕ nom̐ḍu yemibhāgyamu sesĕno
sirulavalabulĕllā sĕkkula niṁḍĕnu
(||||)
seva seyiṁchugŏṁṭivi siggulu derisidivi
bhāviṁchi vanida niṁta panigŏṁṭivi
pāvanamĕ tanajanmaphala madiyĕṭṭido
seva derinavalabu movimīm̐da nunnadi
(||||)
gakkanam̐ bĕṁḍlāḍidivi kām̐giḍam̐ gūḍidivi
mikkiliveḍuga nalamelumaṁganu
yikkava śhrī veṁkaḍeśha yĕḍuvaṁṭidagulamo
sakkanivalabulĕllā sannulabai nunnavi