చూడవయ్యా నీ దేవుల సుగుడతనము నేఁడు
(॥పల్లవి॥)
చూడవయ్యా నీ దేవుల సుగుడతనము నేఁడు
యీడనే బుద్దులు చెప్పి యియ్యకొలుపరాదా
(॥చూడ॥)
వీడెము నీ చేతి కిచ్చి విఱ్ఱవీఁగితేఁ దనకు
తోడిసవతులు పంకింతురా యిపుడు
వేడుక గలితే నీతో వినోదము లాడుఁగాక
వాడవారినల్లాఁ దా వంచుకొనఁ గలదా
(॥చూడ॥)
సరసము నీతో నాడి సలిగెలు చూపితేను
సరివారు వెరతురా సారెఁదనకు
దొరయైతే యిట్టె నీతొడ యెక్కుకొనుఁగాక
పెరవారితో నీడు వెట్టుకొనఁగలదా
(॥చూడ॥)
పెనఁగి నిన్నుఁ గూడి తా పెద్దరికాన నుండితే
వొనరి పెండ్లాడినవా రొదుగుదురా
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
పనివడి మాతోను పంతమాడఁ గలదా
(||pallavi||)
sūḍavayyā nī devula suguḍadanamu nem̐ḍu
yīḍane buddulu sĕppi yiyyagŏlubarādā
(||sūḍa||)
vīḍĕmu nī sedi kichchi viṭravīm̐gidem̐ danagu
toḍisavadulu paṁkiṁturā yibuḍu
veḍuga galide nīdo vinodamu lāḍum̐gāga
vāḍavārinallām̐ dā vaṁchugŏnam̐ galadā
(||sūḍa||)
sarasamu nīdo nāḍi saligĕlu sūbidenu
sarivāru vĕradurā sārĕm̐danagu
dŏrayaide yiṭṭĕ nīdŏḍa yĕkkugŏnum̐gāga
pĕravārido nīḍu vĕṭṭugŏnam̐galadā
(||sūḍa||)
pĕnam̐gi ninnum̐ gūḍi tā pĕddarigāna nuṁḍide
vŏnari pĕṁḍlāḍinavā rŏdugudurā
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
panivaḍi mādonu paṁtamāḍam̐ galadā