Soodavayyaa aamduvaarisuddu liduvamtivi

చూడవయ్యా ఆఁడువారిసుద్దు లిటువంటివి
Language

(॥పల్లవి॥)
చూడవయ్యా ఆఁడువారిసుద్దు లిటువంటివి
వాడికగా నాడనుండే వాసులు రేఁచీని

(॥॥)
వెలయ నీతో నేను వేడుకకు నవ్వఁగాను
నలినాక్షి యెవ్వతో సన్నలుసేసీని
నిలిచి నీవు నాతో నెయ్యములు చూపఁగాను
కెలన నుండి తాను కేఁకరించీవి

(॥॥)
అరుదుగ నీవొద్దను ఆసతోఁ గూచుండఁగాను
కెరలుచుఁ దా కిలకిలనవ్వీవి
సరసము నీవు నాతో సారె సారె నాడఁగాను
యిరవుగా నేతువ లెత్తిపెట్టీవి

(॥॥)
వొనరి నీకు నేను వూడిగాలు సేయఁగాను
వెనకనుండి తాను వెంగెమాడీని
యెనసితివి శ్రీ వేంతటేశ నన్ను వింతలోనె
వినయముతోఁ దాను వేఁడుకొనీని

(||pallavi||)
sūḍavayyā ām̐ḍuvārisuddu liḍuvaṁṭivi
vāḍigagā nāḍanuṁḍe vāsulu rem̐sīni

(||||)
vĕlaya nīdo nenu veḍugagu navvam̐gānu
nalinākṣhi yĕvvado sannalusesīni
nilisi nīvu nādo nĕyyamulu sūbam̐gānu
kĕlana nuṁḍi tānu kem̐kariṁchīvi

(||||)
aruduga nīvŏddanu āsadom̐ gūsuṁḍam̐gānu
kĕralusum̐ dā kilagilanavvīvi
sarasamu nīvu nādo sārĕ sārĕ nāḍam̐gānu
yiravugā neduva lĕttibĕṭṭīvi

(||||)
vŏnari nīgu nenu vūḍigālu seyam̐gānu
vĕnaganuṁḍi tānu vĕṁgĕmāḍīni
yĕnasidivi śhrī veṁtaḍeśha nannu viṁtalonĕ
vinayamudom̐ dānu vem̐ḍugŏnīni