చూడవయ్య యెంతకెంత సోద్యము నేఁడు
(॥పల్లవి॥)
చూడవయ్య యెంతకెంత సోద్యము నేఁడు
వాడికె వలపు రేఁచి వడిఁబెట్టేదాననా
(॥చడ॥)
పలుమారు నిన్నునింత పంగించేదాననా
తలఁగక సేవసేసేదానఁగాక
చెలఁగి నీవే రట్టు సేసుకొనేవింతే కాక
చలపట్టి నిన్ను నేను సాదించేదాననా
(॥చడ॥)
ఆసకొలిపి నిన్నింత అలయించేదాననా
తాసువలె లోనై వుండేదానఁ గాక
వాసి రేఁచుకొని నీవేవచ్చిటు దూరేవు గాక
వేసాలకు నీపై తప్పు వేసేటిదాననా
(॥చడ॥)
కాఁగిట నిన్నుఁగూడి కాఁకరేఁచేదాననా
దాఁగక రతుల మెచ్చేదానఁ గాక
వీఁగక శ్రీవెంకటేశ వేడుక నన్నేలితివి
చేఁగగోరు నాఁట నిన్నుఁ జేఁతసేసుదాననా
(||pallavi||)
sūḍavayya yĕṁtagĕṁta sodyamu nem̐ḍu
vāḍigĕ valabu rem̐si vaḍim̐bĕṭṭedānanā
(||saḍa||)
palumāru ninnuniṁta paṁgiṁchedānanā
talam̐gaga sevasesedānam̐gāga
sĕlam̐gi nīve raṭṭu sesugŏneviṁte kāga
salabaṭṭi ninnu nenu sādiṁchedānanā
(||saḍa||)
āsagŏlibi ninniṁta alayiṁchedānanā
tāsuvalĕ lonai vuṁḍedānam̐ gāga
vāsi rem̐sugŏni nīvevachchiḍu dūrevu gāga
vesālagu nībai tappu veseḍidānanā
(||saḍa||)
kām̐giḍa ninnum̐gūḍi kām̐karem̐sedānanā
dām̐gaga radula mĕchchedānam̐ gāga
vīm̐gaga śhrīvĕṁkaḍeśha veḍuga nannelidivi
sem̐gagoru nām̐ṭa ninnum̐ jem̐tasesudānanā