Soodavayya needo pomdu sulabhamaa imdarigi

చూడవయ్య నీతో పొందు సులభమా ఇందరికి
Language

(॥పల్లవి॥)
చూడవయ్య నీతో పొందు సులభమా ఇందరికి
వేడుక పైఁబూయక వేరే నీవు మెచ్చేవా

(॥చూడ॥)
చెప్పినట్టె సేసి మీ చెలులకెల్లా నేను
నెప్పున నిచ్చలాడక నీవు మెచ్చేవా
చప్పుడు సేయక పై పై సరసము లాడుకొంటా
తప్పు నీపై లేదనక తగ నీవు మెచ్చేవా

(॥చూడ॥)
మోమెత్తి పట్టుక నీకు మోహములు చల్లుకొంటా
నీ మనసు గరచక నీవు మెచ్చేవా
దీమసము సేసుకొని తెలివిదెచ్చుక సారె
ఆమని నవ్వు నవ్వక అటు నీవు మెచ్చేవా

(॥చూడ॥)
కాతరించి విన్నపాలు కడు నీకు విన్నవించి
నీతో నిట్లాఁ గూడక నీవు మెచ్చేవా
యీతల శ్రీ వేంకటేశ యేలితివి నన్ను వలె
జాతినీతి నెరయక సరి నీవు మెచ్చేవా

(||pallavi||)
sūḍavayya nīdo pŏṁdu sulabhamā iṁdarigi
veḍuga paim̐būyaga vere nīvu mĕchchevā

(||sūḍa||)
sĕppinaṭṭĕ sesi mī sĕlulagĕllā nenu
nĕppuna nichchalāḍaga nīvu mĕchchevā
sappuḍu seyaga pai pai sarasamu lāḍugŏṁṭā
tappu nībai ledanaga taga nīvu mĕchchevā

(||sūḍa||)
momĕtti paṭṭuga nīgu mohamulu sallugŏṁṭā
nī manasu garasaga nīvu mĕchchevā
dīmasamu sesugŏni tĕlividĕchchuga sārĕ
āmani navvu navvaga aḍu nīvu mĕchchevā

(||sūḍa||)
kādariṁchi vinnabālu kaḍu nīgu vinnaviṁchi
nīdo niṭlām̐ gūḍaga nīvu mĕchchevā
yīdala śhrī veṁkaḍeśha yelidivi nannu valĕ
jādinīdi nĕrayaga sari nīvu mĕchchevā