Soodavayya nee sudadi vilaasamu

చూడవయ్య నీ సుదతి విలాసము
Language

(॥పల్లవి॥)
చూడవయ్య నీ సుదతి విలాసము
వేడుకకాఁడవు విభుఁడవు నీవు

(॥చూడ॥)
వున్నమవెన్నెల పోగులువోసీ
సన్నపు నవ్వుల జవరాలు
వన్నెలఁ గుంకుమ వసంతమాడీ
యిన్నిటాఁ గళలతో యీ మెఱుఁగుఁబోఁడి

(॥చూడ॥)
పాటించి తుమ్మిదపౌఁజులు దీర్చీ
కాటుక కన్నుల కలికి
సూటి జక్కవల జోడలరించీ
నాటకపు గతుల నాభిసరసి

(॥చూడ॥)
అంగజు రథమున హంసలు నిలిపీ
కంగులేని ఘనగజగమనా
యింగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె
వంగెన సురతపు పల్లవాధరి

(||pallavi||)
sūḍavayya nī sudadi vilāsamu
veḍugagām̐ḍavu vibhum̐ḍavu nīvu

(||sūḍa||)
vunnamavĕnnĕla poguluvosī
sannabu navvula javarālu
vannĕlam̐ guṁkuma vasaṁtamāḍī
yinniḍām̐ gaḽalado yī mĕṟum̐gum̐bom̐ḍi

(||sūḍa||)
pāḍiṁchi tummidabaum̐julu dīrsī
kāḍuga kannula kaligi
sūḍi jakkavala joḍalariṁchī
nāḍagabu gadula nābhisarasi

(||sūḍa||)
aṁgaju rathamuna haṁsalu nilibī
kaṁguleni ghanagajagamanā
yiṁgidabu śhrīveṁkaḍeśha ninnĕnasĕ
vaṁgĕna suradabu pallavādhari