చూడవయ్య ఇవి ఇంతిసొంపులెల్లాను
(॥పల్లవి॥)
చూడవయ్య ఇవి ఇంతిసొంపులెల్లాను
తోడనే కూచుండవయ్య తొయ్యలి సంగడిని
(॥॥)
నీవు విచ్చే సేవనుచు నేలఁతతో జెప్పితేను
చేవదేరి మిగులానుఁ జెంగలించేను
లేవె గని పవ్వళించే నోవరి సింగారించె
ఆవటించి పరిమళా లాయిత్తము సేసేను
(॥॥)
తను బెండ్లాడేవనుచు తరుణి కెరిఁగించితే
ఘనమైన సంతోషాన కలరేఁగెను
మునుకొని ముంగిటను ముత్యాలముగ్గులు వెట్టి
యెనలేని ఆరతు లాఇత్తముగఁ జేసేను
(॥॥)
నెలకొని తెరలోన నీదిక్కు చూపితేను
నలువంక సెలవులు నవ్వు నవ్వెను
యెలమి శ్రీవేంకటేశ ఇదె నీవు గూడితివి
అలరిన మోవివిందు లాయిత్తము సేసేను
(||pallavi||)
sūḍavayya ivi iṁtisŏṁpulĕllānu
toḍane kūsuṁḍavayya tŏyyali saṁgaḍini
(||||)
nīvu vichche sevanusu nelam̐tado jĕppidenu
sevaderi migulānum̐ jĕṁgaliṁchenu
levĕ gani pavvaḽiṁche novari siṁgāriṁchĕ
āvaḍiṁchi parimaḽā lāyittamu sesenu
(||||)
tanu bĕṁḍlāḍevanusu taruṇi kĕrim̐giṁchide
ghanamaina saṁtoṣhāna kalarem̐gĕnu
munugŏni muṁgiḍanu mutyālamuggulu vĕṭṭi
yĕnaleni āradu lāittamugam̐ jesenu
(||||)
nĕlagŏni tĕralona nīdikku sūbidenu
naluvaṁka sĕlavulu navvu navvĕnu
yĕlami śhrīveṁkaḍeśha idĕ nīvu gūḍidivi
alarina moviviṁdu lāyittamu sesenu