Soodare yemta pagadu sudadulaalaa

చూడరే యెంత పగటు సుదతులాలా
Language

(॥పల్లవి॥)
చూడరే యెంత పగటు సుదతులాలా
వాడవారా తమలోని వంక లొత్తేవారు

(॥చూడ॥)
మగనికి వాలికి మాఁటపలుకైతేమ
తగవులు దిద్దేవారు దండచెలులా
యెగసక్కేలకు తామే యెంతమేరమీరినా
అగపడి నేమెల్లా నడ్డాలు వచ్చేమా

(॥చూడ॥)
తనకు నాపెకు లోలో తమకాలు రేఁగితేను
చనవున మెచ్చేవారు సవతులా
చెనకుచుఁదమంతనే సిగ్గులఁ బొరలఁగాను
పెనఁగి నేము రతికిఁ బెడరేఁచేవారమా

(॥చూడ॥)
బావా మరదలుఁ గూడి పరవశమందఁగాను
యీవలఁబొరుగువారు యెచ్చరించేరా
శ్రీవేంకటేశ్వరుఁడే చేరి మమ్ము దమ్మూ నేలె
వేవేలకయినాను విడనాడేమా

(||pallavi||)
sūḍare yĕṁta pagaḍu sudadulālā
vāḍavārā tamaloni vaṁka lŏttevāru

(||sūḍa||)
maganigi vāligi mām̐ṭabalugaidema
tagavulu diddevāru daṁḍasĕlulā
yĕgasakkelagu tāme yĕṁtameramīrinā
agabaḍi nemĕllā naḍḍālu vachchemā

(||sūḍa||)
tanagu nābĕgu lolo tamagālu rem̐gidenu
sanavuna mĕchchevāru savadulā
sĕnagusum̐damaṁtane siggulam̐ bŏralam̐gānu
pĕnam̐gi nemu radigim̐ bĕḍarem̐sevāramā

(||sūḍa||)
bāvā maradalum̐ gūḍi paravaśhamaṁdam̐gānu
yīvalam̐bŏruguvāru yĕchchariṁcherā
śhrīveṁkaḍeśhvarum̐ḍe seri mammu dammū nelĕ
vevelagayinānu viḍanāḍemā