Soodare yeedanimaada sudadulaala

చూడరే యీతనిమాట సుదతులాల
Language

(॥పల్లవి॥)
చూడరే యీతనిమాట సుదతులాల
పాడి పాడి నాతోనెంత పతిజ్ఞ లాడీని

(॥చడ॥)
మగవాఁడు తానైనది మగువలకే కాక
తగుల నెందూనంటాఁ దా నేలనీనే
చిగురుఁబెదవితేనె చెలువలకే కాక
యెగసక్కేలకు నది యెందు వోసీనే

(॥చడ॥)
జవ్వనముగలదెల్లా సతులఁ బొందనే కాక
యెవ్వతేఁ గూడనంటా నే లిచ్చ లాడీనే
నవ్వులు సరసములు నాతులతోనే కాక
మువ్వంకాఁ దానెటువలె మూటగట్టీనే

(॥చడ॥)
కోరి తా జాణఁ డైనది గొల్లెతల నంటఁ గాక
వూరకే యాచారలెల్లా నొడిగట్టీనే
యీరీతి శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁ గూడె
సారె నావాఁడనే యంటా సమ్మతిసేసీనే

(||pallavi||)
sūḍare yīdanimāḍa sudadulāla
pāḍi pāḍi nādonĕṁta padijña lāḍīni

(||saḍa||)
magavām̐ḍu tānainadi maguvalage kāga
tagula nĕṁdūnaṁṭām̐ dā nelanīne
sigurum̐bĕdavidenĕ sĕluvalage kāga
yĕgasakkelagu nadi yĕṁdu vosīne

(||saḍa||)
javvanamugaladĕllā sadulam̐ bŏṁdane kāga
yĕvvadem̐ gūḍanaṁṭā ne lichcha lāḍīne
navvulu sarasamulu nāduladone kāga
muvvaṁkām̐ dānĕḍuvalĕ mūḍagaṭṭīne

(||saḍa||)
kori tā jāṇam̐ ḍainadi gŏllĕdala naṁṭam̐ gāga
vūrage yāsāralĕllā nŏḍigaṭṭīne
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐ gūḍĕ
sārĕ nāvām̐ḍane yaṁṭā sammadisesīne