Soodare vo selulaala sugunadanaalu taanu

చూడరే వో చెలులాల సుగుణతనాలు తాను
Language

(॥పల్లవి॥)
చూడరే వో చెలులాల సుగుణతనాలు తాను
ఆడరే మీరిందరును ఆయములు సోఁకను

(॥॥)
వలసిఁనమానినుల వద్ద నుండఁడా తాను
చెలఁగి చెప్పినట్టెల్లాఁ జేయఁడా తాను
తిలకించి సారెసారె దిష్టించుకోఁడా తాను
నెలవై పెద్దరికాలు నెరపీఁ దా నీడను

(॥॥)
కెరలినకాంతలకు కిందుపడఁడా తాను
ఇరవుగ చనవెల్లా నియ్యఁడా తాను
గొరబుగాఁ గుచముల కుమ్మించుకోఁడా తాను
దొరతనాలన్నియును దొడ్డివెట్టీ నీడను

(॥॥)
యెనసినసతులకు నెంగిలిపడఁడా తాను
ఘనుఁడై అన్నిటా లోనుగాఁడా తాను
యెనలేని శ్రీవేంకటేశుఁడు తా ననుఁ గూడి
ననిచి తగవులెల్లా నడపీఁదా నీడను

(||pallavi||)
sūḍare vo sĕlulāla suguṇadanālu tānu
āḍare mīriṁdarunu āyamulu som̐kanu

(||||)
valasim̐namāninula vadda nuṁḍam̐ḍā tānu
sĕlam̐gi sĕppinaṭṭĕllām̐ jeyam̐ḍā tānu
tilagiṁchi sārĕsārĕ diṣhṭiṁchugom̐ḍā tānu
nĕlavai pĕddarigālu nĕrabīm̐ dā nīḍanu

(||||)
kĕralinagāṁtalagu kiṁdubaḍam̐ḍā tānu
iravuga sanavĕllā niyyam̐ḍā tānu
gŏrabugām̐ gusamula kummiṁchugom̐ḍā tānu
dŏradanālanniyunu dŏḍḍivĕṭṭī nīḍanu

(||||)
yĕnasinasadulagu nĕṁgilibaḍam̐ḍā tānu
ghanum̐ḍai anniḍā lonugām̐ḍā tānu
yĕnaleni śhrīveṁkaḍeśhum̐ḍu tā nanum̐ gūḍi
nanisi tagavulĕllā naḍabīm̐dā nīḍanu