Soodare vo selulaala suddu lemi seppeem daanu

చూడరే వో చెలులాల సుద్దు లేమి చెప్పీఁ దాను
Language

(॥పల్లవి॥)
చూడరే వో చెలులాల సుద్దు లేమి చెప్పీఁ దాను
వేడుకఁ దన చేఁతలు వెల్లావిరులాయను

(॥॥)
వెలయ సారెఁ దనకు విన్నపము సేసే దేమే
తలఁపు లోపలి మాట తా నెఱుఁగును
చలములు తన తోనే సాదించేదాన నటే
కలువ పూవుల వేటు కమ్మెఁ జంటిమీఁదను

(॥॥)
తగిలి తనతో నేను తారుకాణించే దేమే
నగవు తనసెలవి నానుచున్నది
పగటునఁ దనతోను పంతమాడేదాననటే
బిగువుఁ గౌఁగిట మోవి పిప్పిగట్టే నిపుడు

(॥॥)
సొలసి సొలసి తన్ను సూటిగాఁ జూచే దేమే
పులకలు తన మేనఁ బొదిగొనేను
యెలమి శ్రీ వేంకటేశుఁ డే నలమేలుమంగను
మలసి వలపులను మరిగించె నన్నునూ

(||pallavi||)
sūḍare vo sĕlulāla suddu lemi sĕppīm̐ dānu
veḍugam̐ dana sem̐talu vĕllāvirulāyanu

(||||)
vĕlaya sārĕm̐ danagu vinnabamu sese deme
talam̐pu lobali māḍa tā nĕṟum̐gunu
salamulu tana tone sādiṁchedāna naḍe
kaluva pūvula veḍu kammĕm̐ jaṁṭimīm̐danu

(||||)
tagili tanado nenu tārugāṇiṁche deme
nagavu tanasĕlavi nānusunnadi
pagaḍunam̐ danadonu paṁtamāḍedānanaḍe
biguvum̐ gaum̐giḍa movi pippigaṭṭe nibuḍu

(||||)
sŏlasi sŏlasi tannu sūḍigām̐ jūse deme
pulagalu tana menam̐ bŏdigŏnenu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
malasi valabulanu marigiṁchĕ nannunū