చూడరే వో చెలులాల సుదతి సింగారము
(॥పల్లవి॥)
చూడరే వో చెలులాల సుదతి సింగారము
వేడుకతోడఁ దోడ విలాసము మించెను
(॥॥)
అలరిననెమ్మోము అద్దమయినకతన
మెలుపునఁ గళల నేమించులు మించె
లలిఁ దురుమెల్లా నీలపురాలైనకతన
కలికిచూపులు నిండుఁ గాంతు లిట్టె మించెను
(॥॥)
పగటున మోవి బింబఫలమైయున్న కతన
పొగడొందుమాటలతీపులు మించెను
తగునాభి సరసియై తనరినకతమున
సిగిడి మొక్కులకరనీరజములు మించె
(॥॥)
నెట్టన మేను లతై నెగడినకతమున
కిట్టి శ్రీ వేంకటేశుకాఁగిటఁ బాఁకెను
అట్టె చన్నులు నిమ్మపండ్లయి వుండినకతన
పట్ట నితనిచేతులఁ బాదుకొని మించెను
(||pallavi||)
sūḍare vo sĕlulāla sudadi siṁgāramu
veḍugadoḍam̐ doḍa vilāsamu miṁchĕnu
(||||)
alarinanĕmmomu addamayinagadana
mĕlubunam̐ gaḽala nemiṁchulu miṁchĕ
lalim̐ durumĕllā nīlaburālainagadana
kaligisūbulu niṁḍum̐ gāṁtu liṭṭĕ miṁchĕnu
(||||)
pagaḍuna movi biṁbaphalamaiyunna kadana
pŏgaḍŏṁdumāḍaladībulu miṁchĕnu
tagunābhi sarasiyai tanarinagadamuna
sigiḍi mŏkkulagaranīrajamulu miṁchĕ
(||||)
nĕṭṭana menu ladai nĕgaḍinagadamuna
kiṭṭi śhrī veṁkaḍeśhugām̐giḍam̐ bām̐kĕnu
aṭṭĕ sannulu nimmabaṁḍlayi vuṁḍinagadana
paṭṭa nidanisedulam̐ bādugŏni miṁchĕnu