Soodarammaa yee kottalu sudadulaala

చూడరమ్మా యీ కొత్తలు సుదతులాల
Language

(॥పల్లవి॥)
చూడరమ్మా యీ కొత్తలు సుదతులాల
వేడుకలన్నియు వెల్లవిరులాయ నిదివో

(॥చూడ॥)
కొండలవంటి వలపు కుప్పలయ్యే కాలమున
కొండలంతేసి చన్నులు కొమ్మకమరె
దిండుకట్టి యాసలు తీగెలుసాగే కాలాన
గుండుఁజేతుల తీగెలు కొమ్మ కొప్పె నిదివో

(॥చూడ॥)
చీఁకటివంటి చిత్తము చిమ్మిరేఁగే కాలమున
చీఁకటి గొనే తురుము చెలికి మించె
వేఁకమైన సిగ్గుల వెన్నెల కాలమున
మూఁక నవ్వు వెన్నెలలు మొలచె నేఁడిదివో

(॥చూడ॥)
పంట వండే జవ్వనము ఫలియించేకాలమున
పంటమోవి యింతికి ఫలియించెను
నంటు శ్రీవేంకటేశుతో ననిచినకాలమున
జంట పులక ననలు జాజుకొనె నిదివో

(||pallavi||)
sūḍarammā yī kŏttalu sudadulāla
veḍugalanniyu vĕllavirulāya nidivo

(||sūḍa||)
kŏṁḍalavaṁṭi valabu kuppalayye kālamuna
kŏṁḍalaṁtesi sannulu kŏmmagamarĕ
diṁḍugaṭṭi yāsalu tīgĕlusāge kālāna
guṁḍum̐jedula tīgĕlu kŏmma kŏppĕ nidivo

(||sūḍa||)
sīm̐kaḍivaṁṭi sittamu simmirem̐ge kālamuna
sīm̐kaḍi gŏne turumu sĕligi miṁchĕ
vem̐kamaina siggula vĕnnĕla kālamuna
mūm̐ka navvu vĕnnĕlalu mŏlasĕ nem̐ḍidivo

(||sūḍa||)
paṁṭa vaṁḍe javvanamu phaliyiṁchegālamuna
paṁṭamovi yiṁtigi phaliyiṁchĕnu
naṁṭu śhrīveṁkaḍeśhudo nanisinagālamuna
jaṁṭa pulaga nanalu jājugŏnĕ nidivo