చూడరమ్మ యిదె నేఁడు సుక్కురారము
(॥పల్లవి॥)
చూడరమ్మ యిదె నేఁడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాఁడు
(॥చూడ॥)
చప్పుడుతోఁ బన్నీటిమజ్జనముతో నున్నవాఁడు
అప్పుడే ఆదినారాయణునివలె
కప్పురకా పామీఁదఁ గడుఁ బూసుకొన్నవాఁడు
ముప్పిరిఁ బులుకడిగేముత్యమువలె
(॥చూడ॥)
పొసఁగ నప్పటిఁ దట్టుపుణుఁ గలఁదుకొన్నాఁడు
కసుగందని కాలమేఘమువలెను
సుసరాన మేనునిండా సొమ్మువెట్టుకొన్నవాఁడు
పసలఁ బదారువన్నె బంగారువలెను
(॥చూడ॥)
అలమేలుమంగ నురమందు నిడుకొన్నవాఁడు
యెలమి సంపదలకు నిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీఁద నున్నవాఁడు
తలపోసి చూడఁగ దొంతరకొండవలెను
(||pallavi||)
sūḍaramma yidĕ nem̐ḍu sukkurāramu
veḍuga sakkadanālu vevelainām̐ḍu
(||sūḍa||)
sappuḍudom̐ bannīḍimajjanamudo nunnavām̐ḍu
appuḍe ādinārāyaṇunivalĕ
kappuragā pāmīm̐dam̐ gaḍum̐ būsugŏnnavām̐ḍu
muppirim̐ bulugaḍigemutyamuvalĕ
(||sūḍa||)
pŏsam̐ga nappaḍim̐ daṭṭubuṇum̐ galam̐dugŏnnām̐ḍu
kasugaṁdani kālameghamuvalĕnu
susarāna menuniṁḍā sŏmmuvĕṭṭugŏnnavām̐ḍu
pasalam̐ badāruvannĕ baṁgāruvalĕnu
(||sūḍa||)
alamelumaṁga nuramaṁdu niḍugŏnnavām̐ḍu
yĕlami saṁpadalagu nilluvalĕnu
alarusu śhrīveṁkaḍādrimīm̐da nunnavām̐ḍu
talabosi sūḍam̐ga dŏṁtaragŏṁḍavalĕnu