చూడరమ్మ యీతనిసుద్దులెల్ల నిట్లానే
(॥పల్లవి॥)
చూడరమ్మ యీతనిసుద్దులెల్ల నిట్లానే
వేడుకమాఁటలకెల్ల వెసఁ గారాలెక్కవా
(॥చూడ॥)
నగనేరిచినచోట నగితే నమరుఁగాక
జగడగానితోడ సరసమేలా
మొగము నేఁ జూచితేను మొక్కలానఁ దిట్టవచ్చీ
యెగసక్కెపుచన్నుల కిఁక వాండ్లెకవా
(॥చూడ॥)
ఆసలుచల్లేచోట నట్టే కొసరుటగాక
మాసటీనితోడ మారు మలయనేల
బాసగలవాఁడవంటే పై పైనే వొట్టు వెట్టీ
యీసున చిగురుగోళ్ల కిఁక చేఁగలెక్కవా
(॥చూడ॥)
సులభమయినచోట సూటిపడుఁగాక మేలు
చలపాదివాని తోడ సణఁగులేల
యెలమి శ్రీవేంకటేశుఁ డింపుతోడ నన్నుఁ గూడె
యెలయింపుమోవులకు నిఁకఁ గెంపులెక్కవా
(||pallavi||)
sūḍaramma yīdanisuddulĕlla niṭlāne
veḍugamām̐ṭalagĕlla vĕsam̐ gārālĕkkavā
(||sūḍa||)
naganerisinasoḍa nagide namarum̐gāga
jagaḍagānidoḍa sarasamelā
mŏgamu nem̐ jūsidenu mŏkkalānam̐ diṭṭavachchī
yĕgasakkĕbusannula kim̐ka vāṁḍlĕgavā
(||sūḍa||)
āsalusallesoḍa naṭṭe kŏsaruḍagāga
māsaḍīnidoḍa māru malayanela
bāsagalavām̐ḍavaṁṭe pai paine vŏṭṭu vĕṭṭī
yīsuna sigurugoḽla kim̐ka sem̐galĕkkavā
(||sūḍa||)
sulabhamayinasoḍa sūḍibaḍum̐gāga melu
salabādivāni toḍa saṇam̐gulela
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁpudoḍa nannum̐ gūḍĕ
yĕlayiṁpumovulagu nim̐kam̐ gĕṁpulĕkkavā