చూడరమ్మ చెలులాల సుదతి భాగ్యాలు నేఁడు
(॥పల్లవి॥)
చూడరమ్మ చెలులాల సుదతి భాగ్యాలు నేఁడు
వేడుకలెల్లా వెల్లివిరిసినట్లుండె
(॥చూడ॥)
కోమలికొప్పుననుండి కురిసేటివిరులకు
వాములై తుమ్మిదలు వాలఁగాను
కాముఁడు గురులేయఁగా కడనుండి నల్లఁబజ
దోమటి నెఱుకరాను తొడఁగినట్లుండె
(॥చూడ॥)
మెలుత మాటాడఁగాను మించె చిగురుమోవిని
తొలఁగక కోవిలలు తొడుకఁగాను
వలరాజు నఱకిన వాఁడినెత్తురుపట్టెలు
చెలఁగి బంట్లు చికిలిసేసినట్లుండె
(॥చూడ॥)
కొమ్మ శ్రీవేంకటేశ్వరుఁ గూడినచెమటవాన
కుమ్మడిఁ జకోరాలు వొడియఁగాను
దిమ్మురేఁగి మరుఁడు ముత్తేల వసంతమాడఁగా
యిమ్ముల నర్థులు వచ్చి యెదిరినట్టుండె
(||pallavi||)
sūḍaramma sĕlulāla sudadi bhāgyālu nem̐ḍu
veḍugalĕllā vĕllivirisinaṭluṁḍĕ
(||sūḍa||)
komaligŏppunanuṁḍi kuriseḍivirulagu
vāmulai tummidalu vālam̐gānu
kāmum̐ḍu guruleyam̐gā kaḍanuṁḍi nallam̐baja
domaḍi nĕṟugarānu tŏḍam̐ginaṭluṁḍĕ
(||sūḍa||)
mĕluda māḍāḍam̐gānu miṁchĕ sigurumovini
tŏlam̐gaga kovilalu tŏḍugam̐gānu
valarāju naṟagina vām̐ḍinĕtturubaṭṭĕlu
sĕlam̐gi baṁṭlu sigilisesinaṭluṁḍĕ
(||sūḍa||)
kŏmma śhrīveṁkaḍeśhvarum̐ gūḍinasĕmaḍavāna
kummaḍim̐ jagorālu vŏḍiyam̐gānu
dimmurem̐gi marum̐ḍu muttela vasaṁtamāḍam̐gā
yimmula nardhulu vachchi yĕdirinaṭṭuṁḍĕ