Soodaramma selulaala sobagu liddarivini

చూడరమ్మ చెలులాల సొబగు లిద్దరివిని
Language

(॥పల్లవి॥)
చూడరమ్మ చెలులాల సొబగు లిద్దరివిని
వీడని మనోరథాలు మేడలై పెరిగె

(॥చూడ॥)
యెదరుగొండల నెక్కి యిందిరా నౌభళేశుఁడు
మదనతంత్రములై న మాఁటలాడేరు
పెదవితేనెరసాలు వింపిళ్లు గురియఁగా
యిదివో భవనాశి యేరు వారె నడుమ

(॥చూడ॥)
నిలువుగద్దెలమీఁద నెలకొని పందేలతో
సొలపులచెనకుల జూజా లాడేరు
వెలయ సారెలుగాను వినోదాలు నడవఁగా
బలుభవనాశి నెత్తవలకాయ నడుమ

(॥చూడ॥)
యీరీతి శ్రీవేంకటాద్రి నిందు నందు నిద్దరూను
సారెకుఁ గూడుచు సరసము లాడేరు
తారుకాణ చూపుల తలఁబాలు వోయఁ గాను
తేరకొని భవనాశి తెరయాయ నడుమా

(||pallavi||)
sūḍaramma sĕlulāla sŏbagu liddarivini
vīḍani manorathālu meḍalai pĕrigĕ

(||sūḍa||)
yĕdarugŏṁḍala nĕkki yiṁdirā naubhaḽeśhum̐ḍu
madanadaṁtramulai na mām̐ṭalāḍeru
pĕdavidenĕrasālu viṁpiḽlu guriyam̐gā
yidivo bhavanāśhi yeru vārĕ naḍuma

(||sūḍa||)
niluvugaddĕlamīm̐da nĕlagŏni paṁdelado
sŏlabulasĕnagula jūjā lāḍeru
vĕlaya sārĕlugānu vinodālu naḍavam̐gā
balubhavanāśhi nĕttavalagāya naḍuma

(||sūḍa||)
yīrīdi śhrīveṁkaḍādri niṁdu naṁdu niddarūnu
sārĕgum̐ gūḍusu sarasamu lāḍeru
tārugāṇa sūbula talam̐bālu voyam̐ gānu
teragŏni bhavanāśhi tĕrayāya naḍumā