చూడరమ్మ సతులాల సోబానఁ బాడరమ్మ
(॥పల్లవి॥)
చూడరమ్మ సతులాల సోబానఁ బాడరమ్మ
కూడున్నది పతిఁ జూడికుడనాచారి
(॥చూడ॥)
శ్రీమహాలక్ష్మియట సింగారాల కేమరుదు
కాముని తల్లియట చక్కఁదనాల కేమరుదు
సోముని తోఁబుట్టువట సొంపుఁ గళ కేమరుదు
కోమలాంగి యీ చూడికుడుతనాచారి
(॥చూడ॥)
కలశాబ్ధికూఁతురట గంభీరాల కేమరుదు
తలఁప లోకమాతయట దయ మరి యేమరుదు
జలజనివాసియట చల్లఁదన మేమరుదు
కొలఁదిమీర యీ చూడికుడనాచారి
(॥చూడ॥)
అమరపందితయట అట్టె మహి మేమరుదు
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు
తమితో శ్రీవేంకటేశుఁ దానె వచ్చి పెండ్లాడె
కొమెరవయసు చూడికుడుతనాచారి
(||pallavi||)
sūḍaramma sadulāla sobānam̐ bāḍaramma
kūḍunnadi padim̐ jūḍiguḍanāsāri
(||sūḍa||)
śhrīmahālakṣhmiyaḍa siṁgārāla kemarudu
kāmuni talliyaḍa sakkam̐danāla kemarudu
somuni tom̐buṭṭuvaḍa sŏṁpum̐ gaḽa kemarudu
komalāṁgi yī sūḍiguḍudanāsāri
(||sūḍa||)
kalaśhābdhigūm̐turaḍa gaṁbhīrāla kemarudu
talam̐pa logamādayaḍa daya mari yemarudu
jalajanivāsiyaḍa sallam̐dana memarudu
kŏlam̐dimīra yī sūḍiguḍanāsāri
(||sūḍa||)
amarabaṁdidayaḍa aṭṭĕ mahi memarudu
amṛtamu suṭṭamaḍa ānaṁdāla kemarudu
tamido śhrīveṁkaḍeśhum̐ dānĕ vachchi pĕṁḍlāḍĕ
kŏmĕravayasu sūḍiguḍudanāsāri