చూడనిచ్చినంతలోనే సుక్కురారమా
(॥పల్లవి॥)
చూడనిచ్చినంతలోనే సుక్కురారమా
యేడ కేడ తనకు నా కిది యేమే విందు
(॥చూడ॥)
మిక్కిలి బడలే నీ మేనిది యేమంటే
చిక్కితి నీ పాల నంటా చేత మొక్కీనే
వొక్కటంటె వొకకాడి వుండఁ బట్టిదో కాని
యెక్కడి కెక్కడి సుద్దు లిది యేమే వీఁడు
(॥చూడ॥)
చెదరె నీ యలకలు చిన్నఁబోయె మొగమంటే
అది నీకే సెలవంటా నప్పగించీనే
పొదిగి నావెంట వెంట పొద్దువోదో కాని, నే
నెదురంటె కదురనీ నిది యేమే వీఁడు
(॥చూడ॥)
చెంతల శ్రీవేంకటేశ చేయి వట్టే వేమంటే
కొంత గొంత సన్నచేసి గోర నొత్తీనే
యింత జాణ గాకుండితే యిన్ని వుపమల నన్ను
యెంత కెంత సేసి కూడె యిది యేమే వీఁడు
(||pallavi||)
sūḍanichchinaṁtalone sukkurāramā
yeḍa keḍa tanagu nā kidi yeme viṁdu
(||sūḍa||)
mikkili baḍale nī menidi yemaṁṭe
sikkidi nī pāla naṁṭā seda mŏkkīne
vŏkkaḍaṁṭĕ vŏgagāḍi vuṁḍam̐ baṭṭido kāni
yĕkkaḍi kĕkkaḍi suddu lidi yeme vīm̐ḍu
(||sūḍa||)
sĕdarĕ nī yalagalu sinnam̐boyĕ mŏgamaṁṭe
adi nīge sĕlavaṁṭā nappagiṁchīne
pŏdigi nāvĕṁṭa vĕṁṭa pŏdduvodo kāni, ne
nĕduraṁṭĕ kaduranī nidi yeme vīm̐ḍu
(||sūḍa||)
sĕṁtala śhrīveṁkaḍeśha seyi vaṭṭe vemaṁṭe
kŏṁta gŏṁta sannasesi gora nŏttīne
yiṁta jāṇa gāguṁḍide yinni vubamala nannu
yĕṁta kĕṁta sesi kūḍĕ yidi yeme vīm̐ḍu