చూడనే మంచివాఁడవు సుద్దులెన్నైనాఁ గలవు
(॥పల్లవి॥)
చూడనే మంచివాఁడవు సుద్దులెన్నైనాఁ గలవు
వాడికెనే చొక్కింతురా వంతున నీవు
(॥చూడ॥)
క్రియలెఱుఁగుదునంటా కేరి నవ్వనేర్తునంటా
బయలీఁదింతురా నీవు పడఁతులను
దయఁగలవాడనంటా తప్పులెంచ నేనంటా
నయాననే సాదింతురా నడుమ నీవు
(॥చూడ॥)
సోఁకించితి గోరనంటా చుట్టమనయితి నంటా
చీఁకటి దవ్వింతురా చెలువలను
వాఁకమాయ వలపంటా వన్నెకాఁడ నేనంటా
యాఁకట నలయింతురా అప్పడే నీవు
(॥చూడ॥)
యిట్టె కూడితినంటా యిన్నిటా జాణఁడ నంటా
గుట్టు విడిపింతురా కొమ్మల నీవు
కట్టుగా శ్రీ వేంకటేశ నెట్టన నన్నేలితివి
మట్టుమీర మన్నింతురా మక్కువతో నీవు
(||pallavi||)
sūḍane maṁchivām̐ḍavu suddulĕnnainām̐ galavu
vāḍigĕne sŏkkiṁturā vaṁtuna nīvu
(||sūḍa||)
kriyalĕṟum̐gudunaṁṭā keri navvanerdunaṁṭā
bayalīm̐diṁturā nīvu paḍam̐tulanu
dayam̐galavāḍanaṁṭā tappulĕṁcha nenaṁṭā
nayānane sādiṁturā naḍuma nīvu
(||sūḍa||)
som̐kiṁchidi goranaṁṭā suṭṭamanayidi naṁṭā
sīm̐kaḍi davviṁturā sĕluvalanu
vām̐kamāya valabaṁṭā vannĕgām̐ḍa nenaṁṭā
yām̐kaḍa nalayiṁturā appaḍe nīvu
(||sūḍa||)
yiṭṭĕ kūḍidinaṁṭā yinniḍā jāṇam̐ḍa naṁṭā
guṭṭu viḍibiṁturā kŏmmala nīvu
kaṭṭugā śhrī veṁkaḍeśha nĕṭṭana nannelidivi
maṭṭumīra manniṁturā makkuvado nīvu