చూతమువో నీ బలిమి సుదతి బలిమియును
(॥పల్లవి॥)
చూతమువో నీ బలిమి సుదతి బలిమియును
యీతలానాతలా మీరిద్దరు నున్నారు
(॥చూత॥)
మంతనాన నాపె నీతో మాటలాడినప్పుడుగా
పంతములెల్ల నీవు పచారించేది
పొంతనుండి యప్పటినిపూఁచి నవ్వనప్పుడుగా
చింతదీర నావాపెకు సేసవెట్టేది
(॥చూత॥)
శిరసెత్తి నీవంక చెలి చూచినప్పుడుగా
పొరిఁబొరి పొందుసేసి బోదించేది
సరుగన మాటలాడి చలివాసినప్పుడుగా
తరవాతి పనులకుఁ దమకించేది
(॥చూత॥)
తతి నిన్నుఁ గూడి యీకె తనిసినప్పుడుగా
చతురతఁ బవ్వళించి కతచెప్పేది
యితవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మితిమీరినయప్పుడుగా మెచ్చు మెచ్చేది
(||pallavi||)
sūdamuvo nī balimi sudadi balimiyunu
yīdalānādalā mīriddaru nunnāru
(||sūda||)
maṁtanāna nābĕ nīdo māḍalāḍinappuḍugā
paṁtamulĕlla nīvu pasāriṁchedi
pŏṁtanuṁḍi yappaḍinibūm̐si navvanappuḍugā
siṁtadīra nāvābĕgu sesavĕṭṭedi
(||sūda||)
śhirasĕtti nīvaṁka sĕli sūsinappuḍugā
pŏrim̐bŏri pŏṁdusesi bodiṁchedi
sarugana māḍalāḍi salivāsinappuḍugā
taravādi panulagum̐ damagiṁchedi
(||sūda||)
tadi ninnum̐ gūḍi yīgĕ tanisinappuḍugā
saduradam̐ bavvaḽiṁchi kadasĕppedi
yidavai śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
midimīrinayappuḍugā mĕchchu mĕchchedi