చూతమువో నీ బలిమి జోలి యింతేల
(॥పల్లవి॥)
చూతమువో నీ బలిమి జోలి యింతేల
కాతరించి పడనేల కానీలే యిఁకను
(॥చూత॥)
రమ్మంటే నలిగేవు రావుగాఁగ ములిగేవు
నిమ్మపంట వేసితేనే నీకు నొచ్చెనా
వుమ్మడి నాకొనగోర నూఁదితే నేమిసేతువే
యెమ్మెలఁ బంతగత్తె వెందువోయే విఁకను
(॥చూత॥)
వంక చూచితే నవ్వేవు వట్టిసటలఁ బెట్టేవు
కుంకుమనీరు చల్లితే గురిదాఁకెనా
బింకపునీకుచములు పిసికితే నేమందువో
తెంకినే యీచలమెల్లఁ దెలిసెఁబో ఇఁకను
(॥చూత॥)
కాఁగిట సిగ్గుపడేవు కలిసితే నవ్వేవు
కాఁగినమన సొక్కటై కళదాఁకెనా
ఆఁగి శ్రీ వేంకటపతి నదె మెప్పించితి నన్ను
చేఁగల నాచలమెల్లఁ జెల్లెగదె ఇఁకను
(||pallavi||)
sūdamuvo nī balimi joli yiṁtela
kādariṁchi paḍanela kānīle yim̐kanu
(||sūda||)
rammaṁṭe naligevu rāvugām̐ga muligevu
nimmabaṁṭa vesidene nīgu nŏchchĕnā
vummaḍi nāgŏnagora nūm̐dide nemiseduve
yĕmmĕlam̐ baṁtagattĕ vĕṁduvoye vim̐kanu
(||sūda||)
vaṁka sūside navvevu vaṭṭisaḍalam̐ bĕṭṭevu
kuṁkumanīru sallide guridām̐kĕnā
biṁkabunīgusamulu pisigide nemaṁduvo
tĕṁkine yīsalamĕllam̐ dĕlisĕm̐bo im̐kanu
(||sūda||)
kām̐giḍa siggubaḍevu kaliside navvevu
kām̐ginamana sŏkkaḍai kaḽadām̐kĕnā
ām̐gi śhrī veṁkaḍabadi nadĕ mĕppiṁchidi nannu
sem̐gala nāsalamĕllam̐ jĕllĕgadĕ im̐kanu