Soodamugaa yimkam dama suddulellaanu

చూతముగా యిఁకఁ దమ సుద్దులెల్లాను
Language

(॥పల్లవి॥)
చూతముగా యిఁకఁ దమ సుద్దులెల్లాను
యీతల శ్రీపతిదయ నిరవైతి మిపుడు

(॥చూత॥)
కమలాక్షు ప్రతాపము గలిగినయన్నాళ్ళకు
విమతపు వర్గము లే విట నుండీని
సమతతో నితని నామములు మెఱయఁగాను
గములై పాపములు యెక్కడనుండీ నిఁకను

(॥చూత॥)
వాసుదేవుకై దువుల వాఁడి గలంత గాలము
నీసుల యమభటుల కేది దిక్కు
దాసులై యీతనివారు దండి పౌఁజులై యుండఁగా
లాసిభవము లేవంకఁ దలలు చూపీ నిఁకను

(॥చూత॥)
మచ్చిక శ్రీవేంకటేశుమహిమ గలంతవడి
బచ్చెనబంధములు యేపాటు వడీని
యిచ్చట న న్నేలి యీతఁ డెదలోన నుండఁగాను
తుచ్చపు దుర్గుణాలకు తూరఁగఁ జోటేది

(||pallavi||)
sūdamugā yim̐kam̐ dama suddulĕllānu
yīdala śhrībadidaya niravaidi mibuḍu

(||sūda||)
kamalākṣhu pradābamu galiginayannāḽḽagu
vimadabu vargamu le viḍa nuṁḍīni
samadado nidani nāmamulu mĕṟayam̐gānu
gamulai pābamulu yĕkkaḍanuṁḍī nim̐kanu

(||sūda||)
vāsudevugai duvula vām̐ḍi galaṁta gālamu
nīsula yamabhaḍula kedi dikku
dāsulai yīdanivāru daṁḍi paum̐julai yuṁḍam̐gā
lāsibhavamu levaṁkam̐ dalalu sūbī nim̐kanu

(||sūda||)
machchiga śhrīveṁkaḍeśhumahima galaṁtavaḍi
bachchĕnabaṁdhamulu yebāḍu vaḍīni
yichchaḍa na nneli yīdam̐ ḍĕdalona nuṁḍam̐gānu
tuchchabu durguṇālagu tūram̐gam̐ joḍedi