చూతముగా నీవు సేసే చుట్టరికములెల్లాను
(॥పల్లవి॥)
చూతముగా నీవు సేసే చుట్టరికములెల్లాను
నాతి నెన్నిచందముల నమ్మించేవోకాని
(॥చూత॥)
నిక్కి చూచితి వింతిని నెయ్యముతో నవ్వితిని
నెక్కొని యేరీతుల మన్నించేవోకాని
మక్కువతోఁ జేకొంటివి మాఁటలెల్లా నాడితివి
తక్కక యెట్లా దయదలఁచేవోకాని
(॥చూత॥)
సంగడిఁ గూచుండితివి చనవులూ నిచ్చితివి
యెంగిత మెరిఁగి యెప్పు డేలేవోకాని
అంగవించి మెచ్చితివి యాసలఁ దేలించితివి
చెంగట సంతోస మెంత సేసేవోకాని
(॥చూడ॥)
గరిమఁ బెండ్లాడితివి కాఁపురాలూఁ జేసితివి
నిరతి నెచ్చటఁ గరుణించేవోకాని
యిరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
నెరవుగా రతులెన్ని నేరిపేవోకాని
(||pallavi||)
sūdamugā nīvu sese suṭṭarigamulĕllānu
nādi nĕnnisaṁdamula nammiṁchevogāni
(||sūda||)
nikki sūsidi viṁtini nĕyyamudo navvidini
nĕkkŏni yerīdula manniṁchevogāni
makkuvadom̐ jegŏṁṭivi mām̐ṭalĕllā nāḍidivi
takkaga yĕṭlā dayadalam̐sevogāni
(||sūda||)
saṁgaḍim̐ gūsuṁḍidivi sanavulū nichchidivi
yĕṁgida mĕrim̐gi yĕppu ḍelevogāni
aṁgaviṁchi mĕchchidivi yāsalam̐ deliṁchidivi
sĕṁgaḍa saṁtosa mĕṁta sesevogāni
(||sūḍa||)
garimam̐ bĕṁḍlāḍidivi kām̐purālūm̐ jesidivi
niradi nĕchchaḍam̐ garuṇiṁchevogāni
yiravai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
nĕravugā radulĕnni neribevogāni