Soodamugaa amdugemi sodyaalellanu

చూతముగా అందుకేమి సోద్యాలెల్లను
Language

(॥పల్లవి॥)
చూతముగా అందుకేమి సోద్యాలెల్లను
చేతికి లోనైనప్పుడు చెప్పేను మీఁదను

(॥చూత॥)
పంతము దప్పదు మాతోఁ బలికితే నీ కిట్టె
యింతేసిగర్వాలు నేఁడే యేఁటికోయీ
మంతుకు నే నెరిఁగినమనసువాఁడవే నీవు
యింత నింత వొకటికి నినుమిక్కి లయ్యేది

(॥చూత॥)
దొరతన మేమి వోదు తోఁగి చూచితే మమ్ము
యెరవులు వట్టిబిగు వేఁటికోయీ
తెర దీసితే నన్నియు తేట తెల్లమయ్యెది
పెరుగఁ బెరుగఁ దానే పెంటలయ్యీ వలపు

(॥చూత॥)
దగ్గరి వద్దనుండితే తరగదు నీమేను
యెగ్గులు సిగ్గులుఁ దేరె నేఁటికోయీ
అగ్గమై శ్రీవేంకటేశ అట్టెనన్నుఁ గూడితివి
తగ్గుముగ్గులెల్లఁ బాసె తలఁపు లీడేను

(||pallavi||)
sūdamugā aṁdugemi sodyālĕllanu
sedigi lonainappuḍu sĕppenu mīm̐danu

(||sūda||)
paṁtamu dappadu mādom̐ baligide nī kiṭṭĕ
yiṁtesigarvālu nem̐ḍe yem̐ṭigoyī
maṁtugu ne nĕrim̐ginamanasuvām̐ḍave nīvu
yiṁta niṁta vŏgaḍigi ninumikki layyedi

(||sūda||)
dŏradana memi vodu tom̐gi sūside mammu
yĕravulu vaṭṭibigu vem̐ṭigoyī
tĕra dīside nanniyu teḍa tĕllamayyĕdi
pĕrugam̐ bĕrugam̐ dāne pĕṁṭalayyī valabu

(||sūda||)
daggari vaddanuṁḍide taragadu nīmenu
yĕggulu siggulum̐ derĕ nem̐ṭigoyī
aggamai śhrīveṁkaḍeśha aṭṭĕnannum̐ gūḍidivi
taggumuggulĕllam̐ bāsĕ talam̐pu līḍenu